National News: 2030 నాటికి నీట మునగనున్న ఆ మహానగరం .. ఓ అధ్యయనంలో షాకింగ్‌ విషయాలు..

| Edited By: Ravi Kiran

Nov 04, 2021 | 10:14 AM

తీవ్ర భూతాపంతో సముద్ర మట్టాలు పెరిగి రాబోయే రోజుల్లో తీర ప్రాంత నగరాలకు భారీ ముప్పు పొచ్చి ఉందని ఇటీవల పలు అధ్యయనాలు చెబుతున్నాయి..

National News: 2030 నాటికి  నీట మునగనున్న ఆ మహానగరం .. ఓ అధ్యయనంలో షాకింగ్‌ విషయాలు..
Follow us on

తీవ్ర భూతాపంతో సముద్ర మట్టాలు పెరిగి రాబోయే రోజుల్లో తీర ప్రాంత నగరాలకు భారీ ముప్పు పొచ్చి ఉందని ఇటీవల పలు అధ్యయనాలు చెబుతున్నాయి. పర్యావరణ ప్రేమికులు, శాస్త్రవేత్తలు కూడా ఈ విషయంపై ప్రపంచ దేశాలను అప్రమత్తం చేస్తున్నారు. గ్లోబల్‌ వార్మింగ్‌ కారణంగా 2050 కల్లా ముంబై, కలకత్తా లాంటి మహానగరాలు మునిగిపోతాయని ఇటీవల ఓ అధ్యయనం వెల్లడించిన సంగతి తెలిసిందే. అందుకు తగ్గట్లే కొన్ని నెలల క్రితం మన దేశ ఆర్థిక రాజధానిని వరదలు ముంచెత్తిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ విషయంపై క్లైమెట్‌ సెంట్రల్‌ అనే వెబ్‌సైట్‌ మరికొన్ని షాకింగ్‌ విషయాలు బయటపెట్టింది. తీవ్ర భూతాపం కారణంగా 2030 నాటికి కలకత్తాతో పాటు ప్రపంచంలోని 9 తొమ్మిది నగరాలు నీట మునిగిపోయే ప్రమాదముందుని ఈ వెబ్‌సైట్‌ తెలిపింది. ఇందులో భాగంగా ఐపీసీసీ (Intergovernmental panel on climate change) నుంచి సేకరించిన డేటా ఆధారంగా ముంపునకు గురయ్యే నగరాల వివరాలను తెలిపే ఒక మ్యాప్‌ను రూపొందించింది.

జాగ్రత్త పడకపోతే ముప్పు తప్పదు..
ఏటేటా పెరుగుతున్న భూతాపంతో సముద్ర మట్టాలు పెరుగుతున్నాయని దీని ప్రభావం భారత్‌తో పాటు ప్రపంచ దేశాలపై ఉంటుందని క్లైమేట్‌ సెంట్రల్‌ అధ్యయనంలో తేలింది. వాతావరణ మార్పులను అవగాహన చేసుకుని ఇప్పటి నుంచే జాగ్రత్త పడాలని సూచించింది. ఈ సందర్భంగా 2030 నాటికి నీటి అడుగున ఉండే 9 దేశాల వివరాలను బయటపెట్టింది. అవేంటంటే..
1. కలకత్తా
2. అమెస్టర్‌ డ్యామ్‌ (నెదర్లాండ్స్‌)
3. బస్రా (ఇరాక్‌)
4. న్యూ ఓర్లియన్స్‌( అమెరికా)
5. వెనిస్ (ఇటలీ)
6. హోచి మిన్‌ సిటీ (వియత్నాం)
7. బ్యాంకాక్‌ (థాయ్‌లాండ్‌)
8. జార్జ్‌టౌన్‌ (గయానా)
9. సవన్నా (అమెరికా)

Also Read:

Lock Down Again: దేశంలో మళ్లీ లాక్‌డౌన్‌..? ఆ రాష్ట్రంలో లాక్‌డౌన్‌ మొదలు.! మరోసారి పంజా విసురుతున్న కరోనా.. (వీడియో)

Fuel Price: భారీగా త‌గ్గించిన‌ పెట్రోల్, డీజిల్ ధ‌ర‌ల‌తో రాష్ట్రాల‌ను ఇరుకున పెట్టిన మోడీ.. ధ‌ర‌లు త‌గ్గించక త‌ప్ప‌ని స్థితిలోకి..

woman wineyard: రైతుగా మారిన మహిళ.. ఏటా రూ 25 లక్షలు సంపాదన.. ఎలానో తెలిస్తే షాక్ అవుతారు.. (వీడియో)