TVK Manifesto: వారిపై వరాల జల్లు.. టీవీకే చీఫ్ విజయ్ మేనిఫెస్టోలోని హామీలు ఇవే!

తమిళనాడులో అసెంబ్లీ ఎన్నిలకు సమయం దగ్గరపడుతోంది. ఈ నేపథ్యంలో ఓటర్లను ఆకట్టుకునేందుకు, ఎన్నికల్లో గెలిచేందుకు రాజకీయా పార్టీలు కొత్త కొత్త వ్యూహాలు రచిస్తున్నాయి. ఉచితాల పేరుతో కొత్త కొత్త హామీలు ప్రకటిస్తున్నారు. ఈ క్రమంలోనే సినీ నటుడు, టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్ సైతం ప్రజలపై హామీల వర్షం కురిపించారు. ఉమెన్స్ డే సందర్భంగా మహిళలకు అదిరిపోయే వాగ్దానాలు చేశారు. ఇంతకు విజయ్ ఇచ్చిన హామీలు ఏంటో చూద్దాం పదండి.

TVK Manifesto: వారిపై వరాల జల్లు.. టీవీకే చీఫ్ విజయ్ మేనిఫెస్టోలోని హామీలు ఇవే!
Vijay Manifesto Women Promises

Updated on: Mar 08, 2026 | 10:43 AM

గత కొన్ని రోజుల క్రితమే సినిమాలకు గుడ్‌బై చెప్పి రాజకీయాల్లో ప్రవేశించిన థళపతి విజయ్ కొన్ని రోజుల్లోనే తన సొంతగా కొత్త పార్టీని పెడుతున్నట్టు ప్రకటించాడు. అంతేకాదు ఈ సారి జరగబోయే ఎన్నికల్లో పోటీ కూడా చేస్తున్నానని తెలిపారు. ఇక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఇప్పుడు ముందుకు దూసుకెళ్తున్నారు. ఇందులో భాగంగానే తాజాగా ఓటర్లను ఆకట్టుకునేందుకు మేనిఫెట్లోను విడుదల చేశారు. ఈ మేనిఫెస్టోలో మహిళలతో పాటు రైతులకు సైతం వరాల జళ్లు కురిపించారు.

తమిళనాడులో టీవీకే పార్టీ అధికారంలోకి వస్తే ప్రభుత్వ ఉద్యోగులు మినహా 60 సంవత్సరాల వయస్సు వరకు మహిళలకు నెలకు రూ.2,500 ఆర్థిక సహాయం, ఆడపిల్లల పెళ్లి కోసం 8 గ్రాముల బంగారం, పట్టుచీర ఇస్తామని ప్రకటించారు. అంతేకాదు తెలుగు రాష్ట్రాల తరహాలోనే అన్ని రకాల ప్రభుత్వ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తామని ప్రకటించారు. అలాగే కామరాజర్ కల్వి ఉరుతి తిట్టం పథకం కింద స్కూళ్లకు వెళ్లే చిన్నారులకు ప్రతి సంవత్సరం రూ.15 వేలు ఆర్థిక సాయం ఇస్తానని ప్రకటించారు.

అంతేకాకుండా అన్నపూరణి సూపర్ సిక్స్ పథకం కింద ఈ ఆరు గ్యాస్ సిలిండర్లు, రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి చౌకదారా దుకాణాల ద్వారా సానిటరీ ప్యాడ్స్ ఉచితంగా అందేలా చూస్తామని అన్నారు. అలాగే మహిళల రక్షణ కోసం ప్రత్యేక పోలీసు విభాగం ఏర్పాటు చేస్తామని చెప్పుకొచ్చారు. మహిళల భద్రత కోసం ప్రజారవాణా వాహనాల్లో స్మార్ట్ పానిక్ బటన్స్ ఏర్పాటు చేస్తామని చెప్పుకొచ్చారు. అలాగే మహిళా సంఘాల సభ్యులకు రూ.5 లక్షల వరకు వడ్డీలేని రుణాలు ఇస్తామని ప్రకటించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us