ఆ డ్రోన్లు పాకిస్తాన్ ఉగ్రవాదులు ప్రయోగించినవే..జమ్మూ కాశ్మీర్ డీజీపీ.. అధికారులు అలర్ట్ కావాలని హెచ్చరిక

| Edited By: Anil kumar poka

Aug 03, 2021 | 11:00 AM

జమ్మూలో ఇటీవల కనుగొన్న డ్రోన్లు పాకిస్తాన్ కు చెందిన జైషే మహమ్మద్, లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థల టెర్రరిస్టులు ప్రయోగించినవేనని జమ్మూ కాశ్మీర్ డీజీపీ దిల్ బాగ్ సింగ్ తెలిపారు. ఈ కేంద్ర పాలిత ప్రాంతంలో శాంతిని భంగపరిచే ఏ యత్నాన్ని...

ఆ డ్రోన్లు పాకిస్తాన్ ఉగ్రవాదులు ప్రయోగించినవే..జమ్మూ కాశ్మీర్ డీజీపీ.. అధికారులు అలర్ట్ కావాలని హెచ్చరిక
Kashmir Dgp Dil Bagh Singh
Follow us on

జమ్మూలో ఇటీవల కనుగొన్న డ్రోన్లు పాకిస్తాన్ కు చెందిన జైషే మహమ్మద్, లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థల టెర్రరిస్టులు ప్రయోగించినవేనని జమ్మూ కాశ్మీర్ డీజీపీ దిల్ బాగ్ సింగ్ తెలిపారు. ఈ కేంద్ర పాలిత ప్రాంతంలో శాంతిని భంగపరిచే ఏ యత్నాన్ని అయినా ఉక్కుపాదంతో అణచి వేయాలని ఆయన సూచించారు. జమ్మూ కాశ్మీర్ లో వరదలకు గురైన ప్రాంతాలను ఏరియల్ సర్వే చేసి వచ్చిన అనంతరం జరిగిన సమీక్షా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. డ్రోన్ల ద్వారా ఆయుధాలను, డ్రగ్స్ ను ఉగ్రవాదులు జారవిడుస్తున్నారని, ఇందుకు ఆధారాలు ఉన్నాయని ఆయన చెప్పారు. ఉగ్రవాద బృందాలకు నిధులు, ఆయుధాలు సరఫరా కాకుండా చూసేందుకు అధికారులు అధునాతన టెక్నాలజీతో కూడిన సర్వేలెన్స్ టీమ్ లను ఏర్పాటు చేసుకోవాలని, నిఘాను మరింత పెంచాలని ఆయన ఆదేశించారు.అలాగే టెర్రరిస్టు కార్యకలాపాలకు సంబంధించి పెండింగులో ఉన్న అన్ని కేసులను త్వరితగతిన పరిష్కరించాలన్నారు. నేరగాళ్లు తప్పించుకోకుండా చూడాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు.

సరిహద్దుల్లో గస్తీని పెంచాలని, అవసరమైతే మరిన్ని బలగాలను రప్పిద్దామని దిల్ బాగ్ సింగ్ పేర్కొన్నారు. ఈ నెల 15 స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఉగ్రవాదులు జమ్మూ కాశ్మీర్ నియంత్రణ రేఖ దాటి దొంగ చాటుగా చొరబడే సూచనలు ఉన్నాయని ఇప్పటికే ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి సమాచారం అందిందని, అందువల్ల ఇప్పటి నుంచే అలెర్ట్ కావాలని ఆయన అన్నారు. విధుల నిర్వహణలో ఏ మాత్రం అలసత్వం పనికిరాదన్నారు. వరదల్లో గల్లంతయినవారి ఆచూకీని కనుగొని..సహాయక బృందాలు వెంటనే వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాల్సి ఉందని ఆయన సంబంధిత అధికారులకు కూడా సూచించారు.

మరిన్ని ఇక్కడ చూడండి : మొసలితో ముసలావిడ కిరాక్ డాన్స్..!షాక్ కు గురిచేస్తున్న వైరల్ వీడియో..:Old woman dance with crocodile Video.

 షాక్ కొడుతున్న గ్యాస్ సిలిండర్‌..సామాన్యుడికి మరో ఎదురుదెబ్బ..గ్యాస్ సిలిండర్‌ ధర ఎంత..?LPG price hike Video.

 ‘హ్యాపీ ఎనిమీస్ డే’ సరిగ్గా ఆలోచిస్తే స్నేహితులే మన శత్రువులు..అంటూ వర్మ ట్వీట్..:RGV video

 ఊహించని రీతిలో కుక్కను పట్టి నీటిలోకి ఈడ్చుకెళ్లిన మొసలి..షాకింగ్ వీడియో..:Crocodile Grabbing Dog Video.