కశ్మీర్ లోయలో టెర్రర్ అలెర్ట్.. నిఘా హెచ్చరికలు జారీ

| Edited By:

Aug 17, 2019 | 1:05 PM

కశ్మీర్‌ లోయలో ఉగ్రదాడులు జరిగే అవకాశాలున్నట్టు నిఘా వర్గాలు హెచ్చరికలు జారీచేశాయి. ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్ము, కశ్మీర్‌లలో అలజడులు సృష్టించి అశాంతి నెలకొల్పాలనే ఉద్దేశంతో ఉగ్రమూకలు పథకాలు రచించినట్టుగా భద్రతా అధికారులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో కశ్మీర్ ప్రాంతంలో భారీగా బలగాలను కట్టుదిట్టం చేశారు. మరోవైపు ఎలాంటి దాడులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని భద్రతా, వైమానిక దళాలకు ఆదేశాలు కూడా జారీ చేశారు. సరిహద్దు ప్రాంతాల్లో ఉగ్రదాడులను ప్రోత్సహించడం ద్వారా స్ధానికంగా అలజడి సృష్టించి […]

కశ్మీర్ లోయలో టెర్రర్ అలెర్ట్..  నిఘా హెచ్చరికలు జారీ
Follow us on

కశ్మీర్‌ లోయలో ఉగ్రదాడులు జరిగే అవకాశాలున్నట్టు నిఘా వర్గాలు హెచ్చరికలు జారీచేశాయి. ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్ము, కశ్మీర్‌లలో అలజడులు సృష్టించి అశాంతి నెలకొల్పాలనే ఉద్దేశంతో ఉగ్రమూకలు పథకాలు రచించినట్టుగా భద్రతా అధికారులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో కశ్మీర్ ప్రాంతంలో భారీగా బలగాలను కట్టుదిట్టం చేశారు. మరోవైపు ఎలాంటి దాడులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని భద్రతా, వైమానిక దళాలకు ఆదేశాలు కూడా జారీ చేశారు.

సరిహద్దు ప్రాంతాల్లో ఉగ్రదాడులను ప్రోత్సహించడం ద్వారా స్ధానికంగా అలజడి సృష్టించి ప్రజల్లో భయోత్పాతాన్ని కలిగించాలని పాక్ ప్రయత్నిస్తోంది. ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో అంతా సంతోషంగా ఉన్న సమయంలో యూరీ, రాజౌరీ ప్రాంతంలో పాక్ సైనికులు అనూహ్యంగా కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ముగ్గురు పాక్ జవాన్లు మరణించిన సంగతి తెలిసిందే.