Breaking News: తమిళనాట తెలుగు పార్టీ

|

Feb 13, 2020 | 6:53 PM

Telugu political party in Tamil politics: తమిళనాడులో తెలుగు ప్రజలను ఏకం చేయడానికి ఓ తెలుగు పార్టీ ఆవిర్భవించబోతోంది. అది కూడా రాష్ట్ర స్థాయిలో ఉన్నతాధికారిగా పనిచేసి రిటైర్ అయిన మాజీ ఐఏఎస్ అధికారి ఏర్పాటు చేయబోతున్నారు. 2021లో జరిగే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా తమిళనాడులో తెలుగు పార్టీని ఏర్పాటు చేయబోతున్నట్లు సదరు అధికారి ప్రకటించారు. తమిళనాడులో భాషాభిమానం ఏ లెవెల్లో వుంటుందో అందరికీ తెలిసిందే. అలాంటి తమిళనాట.. తెలుగు ప్రజలను ఏకం చేసేందుకు […]

Breaking News: తమిళనాట తెలుగు పార్టీ
Follow us on

Telugu political party in Tamil politics: తమిళనాడులో తెలుగు ప్రజలను ఏకం చేయడానికి ఓ తెలుగు పార్టీ ఆవిర్భవించబోతోంది. అది కూడా రాష్ట్ర స్థాయిలో ఉన్నతాధికారిగా పనిచేసి రిటైర్ అయిన మాజీ ఐఏఎస్ అధికారి ఏర్పాటు చేయబోతున్నారు. 2021లో జరిగే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా తమిళనాడులో తెలుగు పార్టీని ఏర్పాటు చేయబోతున్నట్లు సదరు అధికారి ప్రకటించారు.

తమిళనాడులో భాషాభిమానం ఏ లెవెల్లో వుంటుందో అందరికీ తెలిసిందే. అలాంటి తమిళనాట.. తెలుగు ప్రజలను ఏకం చేసేందుకు తెలుగు పార్టీని పెట్టబోతున్నట్లు ప్రకటించారు తమిళనాడు ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి రామ్మోహన్ రావు. ‘‘ తెలుగు వారి కోసం రాజకీయ పార్టీ పెడతాను..’’ అంటూ ఆరునెలల పాటు తమిళనాడు వ్యాప్తంగా పలు తెలుగు సంఘాలవారిని ఒక్కతాటిపైకి తెచ్చే ప్రక్రియ కొనసాగించిన తర్వాత రాజకీయ పార్టీని ఏర్పాటు చేస్తానని రామ్మోహన్ రావు ప్రకటించారు.

రజినీకాంత్, కమల్ హాసన్ వంటి వారు వారి ప్రకటనల ద్వారా ప్రజలను అయోమయంలోకి నెడుతున్నారని రామ్మోహన్ రావు అంటున్నారు. రజనీకాంత్, కమల్ హాసన్‌లతో పాటు హీరో విజయ్ కూడా రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన చేస్తున్నాడని ఆయన అభిప్రాయపడ్డారు. 2021 ఎన్నికలలో ఎవరు అధికారంలోకి వచ్చినా తెలుగు వారు మాత్రం కచ్చితంగా రాజకీయ శక్తీ గా ఎదగాల్సిన అవసరం వుందని రామ్మోహన్ రావు అంటున్నారు.