ఇంటి ముందు పుర్రెలు.. తమిళనాడులో కలకలం

| Edited By:

Aug 08, 2020 | 9:29 PM

తమిళనాడులో ఇంటి ముందు పుర్రెలు కలకలం రేపాయి. దిండిగుల్‌ జిల్లా పలానీలోని దేవన్‌గర్‌లో పలువురి ఇళ్లు, షాపుల ముందు శుక్రవారం పుర్రెలు దర్శనమిచ్చాయి.

ఇంటి ముందు పుర్రెలు.. తమిళనాడులో కలకలం
Follow us on

Human skull and bones in Tamil Nadu: తమిళనాడులో ఇంటి ముందు పుర్రెలు కలకలం రేపాయి. దిండిగుల్‌ జిల్లా పలానీలోని దేవన్‌గర్‌లో పలువురి ఇళ్లు, షాపుల ముందు శుక్రవారం పుర్రెలు దర్శనమిచ్చాయి. ఏవో పూజలు చేసినట్లుగా వాటి మీద కుంకుమ, పసుపు, నలుపు రంగు ఉన్నాయి. నాలుగు ఇళ్లు, ఒక రేషన్‌ షాపు వద్ద ఈ పుర్రెలు కనిపించాయి. దీంతో అక్కడి వారు షాక్‌తో పాటు ఆందోళనకు గురయ్యారు. దీనిపై వారు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, ప్రాథమిక దర్యాప్తును ప్రారంభించారు. ఈ చర్యకు ఎవరు పాల్పడ్డారన్నది ఇంకా తెలియరాలేదని, ఈ ఘటనపై ఇంకా కేసు నమోదు చేయలేదని ఓ పోలీస్ అధికారి తెలిపారు. సీసీటీవీలను చూస్తే ఏదైనా క్లూ దొరకచ్చని వారు వెల్లడించారు. అయితే స్థానికంగా ఉన్న ఓ గుంపు ఈ చర్యకు పాల్పడ్డట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

Read This Story Also: అన్నవరంలో కరోనా కలకలం.. 14వరకు ఆలయం మూసివేత