తమిళనాడులో 10 మంది పీఎఫ్ఐ సభ్యుల అరెస్ట్..

| Edited By:

Jun 13, 2020 | 7:19 PM

తమిళనాడులో పాపులర్ ఫ్రంట్‌ ఆఫ్ ఇండియా సభ్యులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ వైపు కరోనా మహమ్మారి విజృంభిస్తుంటే.. ఇదే సమయంలో వీరు ఆందోళనలకు దిగారు.

తమిళనాడులో 10 మంది పీఎఫ్ఐ సభ్యుల అరెస్ట్..
Follow us on

తమిళనాడులో పాపులర్ ఫ్రంట్‌ ఆఫ్ ఇండియా సభ్యులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ వైపు కరోనా మహమ్మారి విజృంభిస్తుంటే.. ఇదే సమయంలో వీరు ఆందోళనలకు దిగారు. గతంలో సీఏఏకి వ్యతిరేకంగా నిరసనలు చేసిన సమయంలో పలువురు విద్యార్ధులను పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన విద్యార్ధులను విడుదల చేయాలంటూ మధురై జిల్లాలోని గొరిపాలయం పలువురు పీఎఫ్ఐ సభ్యులు నిరసనలకు దిగారు. పరిస్థితి అదుపుతప్పుతప్పక ముందే పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. సీఏఏకి వ్యతిరేకంగా నిరసనలు చేపట్టిన సమయంలో అరెస్ట్ చేసిన విద్యార్ధులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కాగా, శనివారం నాడు విద్యార్ధులను విడుదల చేయాలని ఆందోళన చేపడుతామని ముందుగానే ప్రకటించారు. ఈ క్రమంలో పోలీసులు అదనపు బలగాలను మోహరించి.. పరిస్థితిని అదుపులో ఉంచారు. ఇదిలావుంటే.. తమిళనాడు కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్న సంగతి తెలిసందే.