కీ చైన్ పడిందని.. అందులో చేయి పెట్టాడంతే.. బ్యాడ్‌లక్‌..

| Edited By: Pardhasaradhi Peri

Feb 24, 2020 | 6:37 AM

తమిళనాడుకు చెందిన ఓ వ్యక్తికి వింత అనుభవం ఎదురైంది. టాయిలెట్‌ హోల్‌లో పడ్డ తన కారు కీ చైన్‌ కోసం.. అందులో చేయిపెట్టాడు. అంతే.. వచ్చిన కష్టాలు అన్నీ ఇన్నీ కావు. వివరాల్లోకి వెళితే.. తమిళనాడులోని మధురై పట్టణంలో ఆదివారం ఉదయం ఓ వ్యక్తికి చేధు అనుభవం ఎదురైంది. తంజావూరుకు చెందిన ఓ వ్యక్తికి సొంతంగా ఓ కారు ఉంది. అతడు ఆ కారును దూరప్రాంతాలకు రెంటల్స్ నడుపుతుంటాడు. అయితే ఎప్పటిలాగే ఆదివారం ఉదయం కూడా తంజావూరునుంచి […]

కీ చైన్ పడిందని.. అందులో చేయి పెట్టాడంతే.. బ్యాడ్‌లక్‌..
Follow us on

తమిళనాడుకు చెందిన ఓ వ్యక్తికి వింత అనుభవం ఎదురైంది. టాయిలెట్‌ హోల్‌లో పడ్డ తన కారు కీ చైన్‌ కోసం.. అందులో చేయిపెట్టాడు. అంతే.. వచ్చిన కష్టాలు అన్నీ ఇన్నీ కావు. వివరాల్లోకి వెళితే.. తమిళనాడులోని మధురై పట్టణంలో ఆదివారం ఉదయం ఓ వ్యక్తికి చేధు అనుభవం ఎదురైంది. తంజావూరుకు చెందిన ఓ వ్యక్తికి సొంతంగా ఓ కారు ఉంది. అతడు ఆ కారును దూరప్రాంతాలకు రెంటల్స్ నడుపుతుంటాడు. అయితే ఎప్పటిలాగే ఆదివారం ఉదయం కూడా తంజావూరునుంచి ప్రయాణికులను మధురైకి తీసుకుని వచ్చాడు. అయితే ప్రయాణికులను వారివారి గమ్యస్థానాల వద్ద దింపేసిన తర్వాత.. తంజావూరుకు తిరుగు ప్రయాణమయ్యాడు. మార్గమధ్యంలో పెట్రోల్‌ కొట్టించుకునేందుకు ఓ పెట్రోల్ బంక్ దగ్గర కారు ఆపి, కాలకృత్యాలు తీర్చుకునేందుకు వాష్‌రూంలోకి వెళ్లాడు. కాసేపటికి ఆయన కారు కీ.. కాస్త ఆ టాయిలెట్ హోల్‌లో పడిపోయింది. దీంతో ఆ కారు కీ చైన్‌ కోసం చేతిని హోల్‌లో పెట్టాడు. అంతే.. అతడికి కీ చైన్ దొరకకుండా.. ఓ మొబైల్ దొరికింది. అది ఎవరిదో తెలీదు కానీ.. అందులో పడిపోయి ఉంది. అయితే అతడి కీ చైన్ కోసం.. ఆ హోల్‌లో మరింత లోపలికి చేతిని పెట్టాడు. అంతే ఇక ఎంతకీ బయటకు రాకుండా పోయింది. ఆ హోల్‌లో అతడి చేయి ఇరుక్కుపోయింది. ఎంత అరచినా… అక్కడ ఆ వ్యక్తి ఆర్తనాదాలు వినేవారే లేకుండా పోయారు. అలా దాదాపు ముప్పై నిమిషాలు గడిచిన తర్వాత.. వాష్‌రూంలోకి వచ్చిన పెట్రోల్‌ బంకు సిబ్బంది ఒకరు అతడ్ని గమనించాడు. ఆ వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించి.. సహాయక చర్యలు చేపట్టారు. ఆ వ్యక్తి చేతిని సురక్షితంగా టాయిలెట్‌ హోల్‌లోంచి బయటకుతీశారు.