జనావాసంలో కింగ్ కోబ్రా ప్రత్యక్షం

| Edited By:

Jul 11, 2020 | 10:18 PM

తమిళనాడులో భారీ కింగ్ కోబ్రా ప్రత్యక్షమైంది. కోయంబత్తూరు జిల్లాలోని తొండముతూర్‌ ప్రాంతంలోని నరసిపురం గ్రామంలో పదిహేను ఫీట్ల పొడువు ఉన్న ఓ కింగ్ కోబ్రా ఎంటర్‌ అయ్యింది. దీంతో ఒక్కసారిగా..

జనావాసంలో కింగ్ కోబ్రా ప్రత్యక్షం
Follow us on

తమిళనాడులో భారీ కింగ్ కోబ్రా ప్రత్యక్షమైంది. కోయంబత్తూరు జిల్లాలోని తొండముతూర్‌ ప్రాంతంలోని నరసిపురం గ్రామంలో పదిహేను ఫీట్ల పొడువు ఉన్న ఓ కింగ్ కోబ్రా ఎంటర్‌ అయ్యింది. దీంతో ఒక్కసారిగా గ్రామ ప్రజలు భయబ్రాంతులకు గురయ్యారు. దీంతో గ్రామస్థులు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. దీంతో వెంటనే గ్రామానికి చేరుకున్న అటవీ శాఖ అధికారులు కింగ్ కోబ్రాను చాకచక్యంగా పట్టుకున్నారు. అనంతరం దానిని సిరువని అటవీ ప్రాంతంలో వదిలిపెట్టారు. దీని పొడువు పదిహేను అడుగులకు పైగా ఉందని అటవీ శాఖ అధికారులు తెలిపారు. ఈ కింగ్ కోబ్రాలు ఈ ప్రాంతంలో రావడం చాలా అరుదని.. ఇవి అత్యంత విషపూరితమైన పాములని తెలిపారు. కాగా, గత వారం ఒడిషాలో కూడా ఇలాంటి కింగ్‌ కోబ్రా ప్రత్యక్షమైంది. వాస్తవానికి ఈ కింగ్ కోబ్రా పాములు దట్టమైన అటవీ ప్రాంతంలో మాత్రమే కన్పిస్తాయి.

 

Tamil Nadu: A 15-feet-long King Cobra was rescued from Narasipuram village in Thondamuthur, Coimbatore by Forest Department today. It was later released into Siruvani forest area. pic.twitter.com/dmyT2lUIRq

— ANI (@ANI) July 11, 2020