అయోధ్య కేసు : నేడు కీలక తీర్పు

| Edited By:

Jul 18, 2019 | 7:04 AM

దేశంలోని అత్యంత సున్నితమైన కేసు రామజన్మభూమి – బాబ్రీ మసీదు కేసు. ఈ కేసు విషయంలో సుప్రీంకోర్టు కొన్ని సంవత్సరాలుగా తీర్పును వాయిదా వేస్తూ వచ్చింది. అయితే.. తాజాగా.. ఈ కేసు పరిష్కారానికి ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీని నియమించారు. ఈ కమిటీని ఆరా తీసిన సుప్రీం.. కేసులో పెద్దగా పురోగతి లేదని భావించి.. పిటిషన్లపై ఈ నెల 11న విచారణ చేపట్టింది. 18వ తేదీ లోపు నివేదిక సమర్పించాలని ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీని ఆదేశించింది. […]

అయోధ్య కేసు : నేడు కీలక తీర్పు
Follow us on

దేశంలోని అత్యంత సున్నితమైన కేసు రామజన్మభూమి – బాబ్రీ మసీదు కేసు. ఈ కేసు విషయంలో సుప్రీంకోర్టు కొన్ని సంవత్సరాలుగా తీర్పును వాయిదా వేస్తూ వచ్చింది. అయితే.. తాజాగా.. ఈ కేసు పరిష్కారానికి ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీని నియమించారు. ఈ కమిటీని ఆరా తీసిన సుప్రీం.. కేసులో పెద్దగా పురోగతి లేదని భావించి.. పిటిషన్లపై ఈ నెల 11న విచారణ చేపట్టింది. 18వ తేదీ లోపు నివేదిక సమర్పించాలని ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీని ఆదేశించింది. ఈ నివేదికను పరిశీలించిన తర్వాత అవసరమైతే ఈ నెల 25 నుంచి రోజువారీ విచారణ చేపడతామని ఇదివరకే సుప్రీం స్పష్టం చేసింది.

అసలు కేసు ఇది :

అయోధ్యలోని 2.77 ఎకరాల వివాదాస్పద భూమిని సున్నీ వక్ఫ్‌బోర్డు, నిర్మోహి అఖాడా, రామ్ లల్లాకు సమానంగా పంచాలని 2010లో అలహాబాద్ హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఈ తీర్పునకు వ్యతిరేకంగా ఇప్పటివరకు సుప్రీంలో 14 పిటిషన్లు దాఖలయ్యాయి.