‘ఆర్టికల్ 370’పై అత్యవసర విచారణ.. ‘నో’ చెప్పిన సుప్రీం

| Edited By:

Aug 08, 2019 | 1:26 PM

జమ్ముకశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దు చేస్తూ మోదీ ప్రభుత్వం చేసిన ప్రకటనను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. దీనిపై అత్యవసర విచారణ జరపాలంటూ ప్రముఖ న్యాయవాది ఎంఎల్ శర్మ సుప్రీంను కోరగా.. దానికి ధర్మాసనం నో చెప్పింది. ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం ఈ పిటిషన్‌ను తగిన సమయంలో విచారిస్తుందని జస్టిస్ రమణ స్పష్టం చేశారు. కాగా మరోవైపు ఆర్టికల్ 370 రద్దు తరువాత జమ్ముకశ్మీర్‌లో ప్రభుత్వం విధించిన నిషేదాఙ్ఞలు, మాజీ సీఎంల నిర్బంధాన్ని సవాల్ […]

‘ఆర్టికల్ 370’పై అత్యవసర విచారణ.. ‘నో’ చెప్పిన సుప్రీం
Follow us on

జమ్ముకశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దు చేస్తూ మోదీ ప్రభుత్వం చేసిన ప్రకటనను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. దీనిపై అత్యవసర విచారణ జరపాలంటూ ప్రముఖ న్యాయవాది ఎంఎల్ శర్మ సుప్రీంను కోరగా.. దానికి ధర్మాసనం నో చెప్పింది. ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం ఈ పిటిషన్‌ను తగిన సమయంలో విచారిస్తుందని జస్టిస్ రమణ స్పష్టం చేశారు.

కాగా మరోవైపు ఆర్టికల్ 370 రద్దు తరువాత జమ్ముకశ్మీర్‌లో ప్రభుత్వం విధించిన నిషేదాఙ్ఞలు, మాజీ సీఎంల నిర్బంధాన్ని సవాల్ చేస్తూ కాంగ్రెస్ కార్యకర్త తహ్‌సీన్ పూనావాలా సుప్రీంలో పిటిషన్ దాఖలు చేశారు. జమ్ముకశ్మీర్‌లో ఆంక్షలు ఉపసంహరించుకోవాలని, మొబైల్ ఇంటర్నెట్, మీడియా ఛానళ్ల ప్రకారం, ఫోన్ లైన్లను వెంటనే పునరుద్ధరించాలని.. నిర్బంధంలో ఉన్న మాజీ సీఎంలు ఒమర్ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీ, ఇతర రాజకీయ నాయకులను వెంటనే విడుదల చేయాలని ఆ పిటిషన్‌లో కోరారు. ఇక ఈ పిటిషన్‌పై కూడా అత్యవసర విచారణ అవసరం లేదని సుప్రీం తిరస్కరించింది.