370 రద్దుపై కేంద్రానికి సుప్రీం ఝలక్!

| Edited By:

Oct 01, 2019 | 12:45 PM

ఆర్టికల్ 370 రద్దును సవాల్ చేస్తూ.. దాఖలైన పిటిషన్లపై రాజ్యంగ ధర్మాసనంలో విచారణ జరిగింది. పిటిషన్లపై సమాధానం ఇచ్చేందుకు కేంద్రానికి నాలుగు వారాల గడువు ఇచ్చిన సుప్రీంకోర్టు. తదుపరి విచారణ నవంబర్ 14కు వాయిదా పడింది. ఆర్టికల్ 370 రద్దును సవాల్ చేస్తూ.. దాఖలైన పిటిషన్లపై ఇటీవలే సుప్రీం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్‌ గొగాయి నేతృత్వంలోని ప్రత్యేక ధర్మాసనం విచారణ జరిపిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్ల కోసం రాజ్యాంగ నేతృత్వంలో రాజ్యంగ ధర్మాసనం ఏర్పాటు […]

370 రద్దుపై కేంద్రానికి సుప్రీం ఝలక్!
Follow us on

ఆర్టికల్ 370 రద్దును సవాల్ చేస్తూ.. దాఖలైన పిటిషన్లపై రాజ్యంగ ధర్మాసనంలో విచారణ జరిగింది. పిటిషన్లపై సమాధానం ఇచ్చేందుకు కేంద్రానికి నాలుగు వారాల గడువు ఇచ్చిన సుప్రీంకోర్టు. తదుపరి విచారణ నవంబర్ 14కు వాయిదా పడింది. ఆర్టికల్ 370 రద్దును సవాల్ చేస్తూ.. దాఖలైన పిటిషన్లపై ఇటీవలే సుప్రీం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్‌ గొగాయి నేతృత్వంలోని ప్రత్యేక ధర్మాసనం విచారణ జరిపిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్ల కోసం రాజ్యాంగ నేతృత్వంలో రాజ్యంగ ధర్మాసనం ఏర్పాటు చేస్తామని .. సీజేఐ తెలిపారు. ఈ మేరకు జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలో రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటైంది.

రాజ్యసభలో జమ్మూ కశ్మీర్‌కు స్వతంత్ర ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370 రద్దుకు భారత హోం శాఖ మంత్రి అమిత్ షా ప్రతిపాదించిన క్షణాల్లోనే రాష్ట్రపతి ఆమోదం తెలుపుతూ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. దీన్ని పార్లమెంట్‌ కూడా.. ఉభయ సభల్లోనూ ఆమోదం తెలిపింది. అంతేగాక.. రాష్ట్రాన్ని రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.