High court: వీర్యదాత, అండం ఇచ్చిన వారికి బిడ్డపై హక్కు ఉంటుందా.? బాంబే హైకోర్టు కీలక తీర్పు

|

Aug 13, 2024 | 7:23 PM

వీర్యం, లేదా అండం ఇచ్చిన వారికి పుట్టిన బిడ్డపై ఎలాంటి చట్టపరమైన హక్కు ఉండదని కోర్టు స్పష్టం చేసింది. పిల్లలకు వారు జీవ సంబంధ తల్లిదండ్రులుగా చెప్పడం కుదరదని తేల్చి చెప్పింది. తన కవల కూమార్లెను చూసేందుకు అనుమతి కోరిన ఓ మహిళ విషయంలో కోర్టు ఈ తీర్పునిచ్చింది. వివరాల్లోకి వెళితే.. ఓ మహిళ తన సోదరురాలి అండం సహాయంతో...

High court: వీర్యదాత, అండం ఇచ్చిన వారికి బిడ్డపై హక్కు ఉంటుందా.? బాంబే హైకోర్టు కీలక తీర్పు
Bombay High Court
Follow us on

ప్రస్తుతం సరోగసి విధానం సర్వసాధారణంగా మారిపోయింది. ఒకప్పుడు కేవలం సెలబ్రిటీలకు మాత్రమే పరిమితమైన ఈ విధానాన్ని కాలక్రమేణ సామాన్యులు సైతం పాటిస్తున్నారు. అయితే ఇదే సమయంలో సరోగసి విధానంలో వీర్యదానం చేసిన పురుషుడుకి, అలాగే అండం ఇచ్చిన మహిళకు పుట్టిన బిడ్డపై చట్టపరమైన హక్కు ఉంటుందా అనే సందేహం రావడం సర్వసాధారణం. అయితే తాజాగా దీనిపైనే బాంబే హైకోర్టు సంచలన తీర్పు వెలల్లడించింది.

వీర్యం, లేదా అండం ఇచ్చిన వారికి పుట్టిన బిడ్డపై ఎలాంటి చట్టపరమైన హక్కు ఉండదని కోర్టు స్పష్టం చేసింది. పిల్లలకు వారు జీవ సంబంధ తల్లిదండ్రులుగా చెప్పడం కుదరదని తేల్చి చెప్పింది. తన కవల కూమార్లెను చూసేందుకు అనుమతి కోరిన ఓ మహిళ విషయంలో కోర్టు ఈ తీర్పునిచ్చింది. వివరాల్లోకి వెళితే.. ఓ మహిళ తన సోదరురాలి అండం సహాయంతో గర్భం దాల్చింది. ఈ సరోగసీ విధానంలోనే 2019లో కవలలు జన్మించారు.

అయితే కొన్ని రోజుల తర్వాత పిటిషనర్‌ సోదరి కుటంబం రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో పిటిషనర్‌ సోదరి కుమార్తెతో పాటు భర్త మృతి చెందారు. 2019 నుంచి 2021 వరకు పిటిషనర్‌ భర్త ఇద్దరు పిల్లలతోనే కలిసి ఉంది. అయితే ఆ తర్వాత వైవాహిక బంధంలో విభేదాల కారణంగా 2021లో భార్యకు చెప్పకుండా ఇద్దరు పిల్లలతో కలిసి భర్త వేరే ఇంటికి వెళ్లిపోయాడు. ఆ తర్వాత రోడ్డు ప్రమాదంతో కుంగుబాటుకు గురైన తన మరదలు (పిటిషనర్‌ సోదరి), పిల్లల బాగోగులను చూసుకేందుకు తనతోనే ఉంటుందని పిటిషనర్‌ భర్త చెప్పాడు.

దీంతో పిటిషనర్ పోలీసులు ఆశ్రయించి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పిల్లలను తనకు అప్పగించాలని కోరింది. అనంతరం కోర్టును ఆశ్రయించడంతో, కోర్టు తన అభ్యర్థను తిరస్కరించింది. దీంతో ఆమె హైకోర్టును ఆశ్రయించగా తాజాగా హైకోర్టు ఈ తీర్పును వెలువరిచింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..