
మార్స్ (అంగారక గ్రహం) పై తమ రోవర్ దిగిన దృశ్యాల తాలూకు వీడియోను నాసా విడుదల చేసింది. ‘పర్సే వెరెన్స్ ‘ అనే ఈ రోవర్ అరుణగ్రహం పై దిగుతూ వేర్వేరు శబ్దాలతో కూడిన గాలి రికార్డింగులను కూడా వినిపించిందని నాసా రీసెర్చర్లు తెలిపారు. ఈ రోవర్ దిగేముందు నారింజ రంగుతో కూడిన పారాచ్యూట్ ని కిందికి వదిలింది. గాలి శబ్దాలను రోవర్ లోని కెమెరా క్యాప్చర్ చేయగలిగిందని శాస్త్రజ్ఞులు తెలిపారు. కానీ మార్స్ పై రోవర్ దిగుతుండగా ఓ మైక్రోఫోన్ పని చేయలేదని తెలిసింది. 10 సెకండ్ల పాటు గాలి శబ్దం వినబడినట్టు వారు చెప్పారు. అటు ఈ రికార్డింగును భూమికి పంపామని కెమెరా లీడ్ ఇంజనీర్ దవే గ్రుయెల్ తెలిపారు. మార్స్ పై దుమ్ము రేగుతున్న జెజెరో అనే క్రేటర్ ని రోవర్ టచ్ చేసిందని, ఇది ల్యాండ్ అవుతుండగా గాలి శబ్దాలను క్యాప్చర్ చేయడం ఇదే మొదటిసారి అని నాసా జెట్ ప్రొపెల్షన్ ల్యాబ్ డైరెక్టర్ మైఖేల్ వాట్ కిన్స్ తెలిపారు. ఇది ఇమేజింగ్ వీడియో అన్నారు. ఇది 3 నిముషాల 25 సెకండ్ల పాటు ఉంది.
గత ఏడాది జులై 30 న నాసా ఈ రోవర్ ను లాంచ్ చేసింది. సమీప భవిష్యత్తులో ఈ విధమైన మరిన్ని వీడియోలను తాము పంపే అవకాశాలు ఉన్నాయని ఈ సంస్థ పేర్కొంది.
Read More:
లీకుల రాయుడులా తమన్… సర్కారీ పాటల డేట్ ఇదే అంటూ.. థమన్ లీకులు