బ్రేకింగ్: కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలిగా కొనసాగనున్న సోనియా గాంధీ

| Edited By: Pardhasaradhi Peri

Aug 24, 2020 | 6:43 PM

కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలిగా సోనియా గాంధీ కొనసాగనున్నారు. ఈ మేరకు సీడబ్ల్యూసీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. కాగా పార్టీ సారథ్య బాధ్యతలపై సీడబ్ల్యూసీ భేటీలో సుధీర్ఘ సమయం చర్చలు సాగాయి. పార్టీ సీనియర్లు రాసిన లేఖపైనా..

బ్రేకింగ్: కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలిగా కొనసాగనున్న సోనియా గాంధీ
Follow us on

కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలిగా సోనియా గాంధీ కొనసాగనున్నారు. ఈ మేరకు సీడబ్ల్యూసీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. కాగా పార్టీ సారథ్య బాధ్యతలపై సీడబ్ల్యూసీ భేటీలో సుధీర్ఘ సమయం చర్చలు సాగాయి. పార్టీ సీనియర్లు రాసిన లేఖపైనా చర్చ జరిగింది. కొత్త అధ్యక్షుడిని ఎన్నుకునే వరకూ సోనియానే కొనసాగాలని కోరిన సీనియర్లు. మన్మోహన్ సింగ్, ఆంటోనీలు సోనియావైపే మొగ్గు చూపుతున్నారు.

కాగా కొద్దిసేపటి క్రితమే కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక‌ అధ్య‌క్ష ప‌ద‌వికి సోనియా గాంధీ రాజీనామా చేశారు. వ‌ర్కింగ్ క‌మిటీ స‌మావేశంలో ఈ విష‌యాన్ని ప్ర‌స్తావించారు. మ‌రో అధ్య‌క్షుడ్ని ఎన్నుకోవాల‌ని స‌భ్యుల‌కు ఆమె సూచించారు. పార్టీలో సమర్ధవంత‌మైన‌ నాయకత్వం గురించి 20 మంది పార్టీ సీనియర్ నేతలు లేఖ రాయడంపై సోనియా అసంతృప్తికి లోనయిన‌ట్లు స‌మాచారం. కాగా మాజీ ప్ర‌ధాని మ‌న్మోహ‌న్, మ‌రో సీనియ‌ర్ నేత ఏకే ఆంటోనిలు.. సోనియానే అధ్య‌క్షురాలిగా కొన‌సాగాల‌ని కోరుతున్నారు.

Read More:

సరదాగా చేపలు పట్టిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే

ప్రముఖ సీనియర్ నటి ఇంట విషాదం

కాస్టింగ్ కౌచ్‌పై అనుష్క కీలక వ్యాఖ్యలు

డబ్బులు కావాలంటే కాల్ చేయండి.. ఏటీఎం ఇంటికే వచ్చేస్తుంది