Ayodhya Temple: విరాళాల పేరుతో ఎన్నికల ప్రచారం.. బీజేపీపై సంచలన ఆరోపణలు చేసిన శివసేన..

|

Dec 22, 2020 | 5:35 AM

రామాలయం పేరుతో బీజేపీ మరోసారి రాజకీయాలకు తెరలేపిందంటూ శివసేన ఫైర్ అయ్యింది. అయోధ్య మందిరానికి విరాళాల సేకరణ పేరుతో 2024లో జరగబోయే లోక్ సభ

Ayodhya Temple: విరాళాల పేరుతో ఎన్నికల ప్రచారం.. బీజేపీపై సంచలన ఆరోపణలు చేసిన శివసేన..
bjp-and-sivasena
Follow us on

Ayodhya Temple:  రామాలయం పేరుతో బీజేపీ మరోసారి రాజకీయాలకు తెరలేపిందంటూ శివసేన ఫైర్ అయ్యింది. అయోధ్య మందిరానికి విరాళాల సేకరణ పేరుతో 2024లో జరగబోయే లోక్ సభ ఎన్నికల ప్రచారానికి తెరలేపిందంటూ ఆరోపించింది. ఈ మేరకు శివసేన పార్టీ తన అధికారిక పత్రిక సామ్నాలో బీజేపీపై విరుచుకుపడింది. విరాళాల పేరుతో బీజేపీ వాలంటీర్లను రంగంలోకి దింపి రాజకీయ ప్రచారం చేసేందుకు ప్రణాళికలు రచిస్తోందని పేర్కొంది. అయోధ్యలో రామమందిరం నిర్మాణం కోసం దేశ వ్యాప్తంగా విరాళాలు సేకరిస్తామని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రకటించిన విషయం తెలిసిందే. దేశ వ్యాప్తంగా 12,00,000 కుటుంబాల నుంచి విరాళాలు సేకరించేందుకు 4,00,000 మంది వాలంటీర్లు పని చేస్తారని ఆ ట్రస్ట్ వెల్లడించింది. అయితే ఈ ప్రకటనపై శివసేన శివాలెత్తింది. అసలు ఎవరీ వాలంటీర్లు అని ప్రశ్నించింది. ఈ వాలంటీర్లను ఎవరు నియమించారంటూ నిలదీసింది.

‘అయోధ్యలో రామమందిరం నిర్మాణం పేరుతో ఈ పోరాటం మొదలైంది. అయితే ఇప్పుడు ఈ కార్యక్రమంలో రాజకీయ పార్టీల చొరవ ఎక్కువైంది. రాజకీయ పార్టీలు, ప్రభుత్వాలు మందిర నిర్మాణాలపై కాకుండా అభివృద్ధిపై దృష్టి పెట్టాలి. రాముడు అయోధ్య రాజు. రామ మందిరం కోసం జరిగిన పోరాటాల్లో అందరం పాలుపంచుకున్నాం. ఆ పోరాటంలో భాగం కావడం దేశానికే గర్వకారణం. ఎంతో మంది ఈ పోరాటంలో తమ ప్రాణాలు కోల్పోయారు. అలాంటి రామాలయం కోసం సాధారణంగానే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందువులందరూ తమ వంతు విరాళాలు ఇస్తారు. అలాంటప్పుడు ప్రత్యేకంగా ఈ విరాళాల సేకరణ కార్యక్రమం ఎందుకు? ఆ వాలంటీర్లు అంతా ఎవరు? వారిని ఎవరు నియమించారు?’’ అని సామ్నాలో బీజేపీని, శ్రీరామ జన్మభూమి ట్రస్ట్‌ను నిలదీసింది.

ఇదిలాఉండగా, రామ జన్మభూమి తీర్థ క్రేత్రం ట్రస్ట్ పేరుతో ఏర్పాటైన ఆ కార్యక్రమం జనవరి 15 నుంచి ఫిబ్రవరి 27 వరకు దేశవ్యాప్తంగా తిరిగి విరాళాలు వసూలు చేయనుందని సామ్నా రాసుకొచ్చింది. అయితే మందిర నిర్మాణం కోసం శివసేన ఇప్పటికే ఒక కోటి రూపాయలు విరాళంగా ఇచ్చింది.