రాహుల్‌కు శివసేన కౌంటర్.. కూటమిలో టెన్షన్..!

| Edited By: Pardhasaradhi Peri

Dec 15, 2019 | 10:49 AM

‘‘నా పేరు రాహుల్ సావర్కార్‌ను కాదు.. రాహుల్ గాంధీ.. నా వ్యాఖ్యలపై నేను గానీ, మరే కాంగ్రెస్ వాది గానీ సారీ చెప్పే ప్రసక్తే లేదు’’ అంటూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్ని రేపాయి. తాజాగా ఈ వ్యాఖ్యలపై శివసేన మండిపడింది. వినాయక్ దామోదర్ సావర్కర్‌ను అవమానించొద్దని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ ట్విట్టర్‌లో ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘వినాయక్ దామోదర్ సావర్కార్ విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదు. సావర్కార్ […]

రాహుల్‌కు శివసేన కౌంటర్.. కూటమిలో టెన్షన్..!
Follow us on

‘‘నా పేరు రాహుల్ సావర్కార్‌ను కాదు.. రాహుల్ గాంధీ.. నా వ్యాఖ్యలపై నేను గానీ, మరే కాంగ్రెస్ వాది గానీ సారీ చెప్పే ప్రసక్తే లేదు’’ అంటూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్ని రేపాయి. తాజాగా ఈ వ్యాఖ్యలపై శివసేన మండిపడింది. వినాయక్ దామోదర్ సావర్కర్‌ను అవమానించొద్దని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ ట్విట్టర్‌లో ఆగ్రహం వ్యక్తం చేశారు.

‘‘వినాయక్ దామోదర్ సావర్కార్ విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదు. సావర్కార్ కేవలం మహారాష్ట్రకే కాకుండా యావత్తు దేశానికి గర్వకారణమైన నాయకుడు. దేశానికి, ఆత్మ గౌరవానికి గర్వకారణమైన నేత. నెహ్రూ, గాంధీల మాదిరిగానే సావర్కార్ కూడా దేశం కోసం జీవితాన్ని త్యాగం చేశారు. అలాంటి వ్యక్తిని గౌరవించాల్సిందే’’ అంటూ సంజయ్ రౌత్ ట్వీట్ చేశారు.

కాగా ఇటీవల పలు డ్రామాల మధ్య మహారాష్ట్రలో మహా వికాస్ ఆఘాడీ(శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ కూటమి) ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈ కూటమి అధికారంలోకి వచ్చి నెల రోజులు కూడా గడవలేదు. ఇలాంటి సమయంలో రాహుల్ చేసిన వ్యాఖ్యలు.. శివసేనను నొప్పించడంతో కూటమిలో టెన్షన్‌ వాతావారణం నెలకొంది. మరోవైపు రాహుల్ చేసిన ఈ వ్యాఖ్యలపై బీజేపీ కూడా ఘాటుగా స్పందించింది. మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ స్పందిస్తూ.. సావర్కార్ గోటికి కూడా రాహుల్ సరితూగరని మండిపడ్డారు.