“పాకిస్థాన్ జిందాబాద్” స్లోగన్స్ ఇచ్చిన యువతికి నక్సల్స్‌తో లింకులు..!

| Edited By: Team Veegam

Feb 25, 2020 | 6:09 PM

కర్ణాటక రాష్ట్రంలో సీఏఏ వ్యతిరేక సభలో పాక్ అనుకూల నినాదాలు కలకలం రేపిన విషయం తెలిసిందే. అయితే ఈ సభలో “పాకిస్తాన్‌ జిందాబాద్‌” నినాదాలు చేసిన యువతికి నక్సలైట్లతో సంబంధాలు ఉన్నాయని కర్ణాటక సీఎం బీఎస్‌ యడియూరప్ప ఆరోపించారు. విచారణ ముగిసిన తర్వాత యువతికి శిక్ష తప్పదని హెచ్చరించారు. యువతను తప్పుదోవ పట్టిస్తున్న.. ఇలాంటి వారిని కఠినంగా శిక్షించాల్సిందేనన్నారు. విచారణలో ఆమె వెనుక ఎవరెవరున్నారో వెల్లడవుతుందని, తీవ్రవాదాన్ని పెంచి పోషించే సంస్థలకు తగిన బుద్ధి చెబుతామన్నారు. సదరు […]

పాకిస్థాన్ జిందాబాద్ స్లోగన్స్ ఇచ్చిన యువతికి నక్సల్స్‌తో లింకులు..!
Follow us on

కర్ణాటక రాష్ట్రంలో సీఏఏ వ్యతిరేక సభలో పాక్ అనుకూల నినాదాలు కలకలం రేపిన విషయం తెలిసిందే. అయితే ఈ సభలో “పాకిస్తాన్‌ జిందాబాద్‌” నినాదాలు చేసిన యువతికి నక్సలైట్లతో సంబంధాలు ఉన్నాయని కర్ణాటక సీఎం బీఎస్‌ యడియూరప్ప ఆరోపించారు. విచారణ ముగిసిన తర్వాత యువతికి శిక్ష తప్పదని హెచ్చరించారు. యువతను తప్పుదోవ పట్టిస్తున్న.. ఇలాంటి వారిని కఠినంగా శిక్షించాల్సిందేనన్నారు.

విచారణలో ఆమె వెనుక ఎవరెవరున్నారో వెల్లడవుతుందని, తీవ్రవాదాన్ని పెంచి పోషించే సంస్థలకు తగిన బుద్ధి చెబుతామన్నారు. సదరు యువతి ప్రవర్తనపై ఆమె తండ్రే ఆగ్రహంగా ఉన్నాడని.. ఆమెకు తగిన శిక్ష పడాలని, బెయిల్‌ కూడా రాకుండా చేయండన్నాడని సీఎం తెలిపారు. అంతేకాదు.. సదరు యువతికి నక్సలైట్లతో సంబంధాలు ఉన్నాయనేందుకు స్పష్టమైన ఆధారాలు ఉన్నాయని యడియూరప్ప పేర్కొన్నారు.

కాగా, గురువారం బెంగుళూరు ఫ్రీడంపార్క్‌లో జరిగిన పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరకిస్తూ నిరసన కార్యక్రమం జరిగిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమానికి ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఓవైసీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అయితే ఓవైసీ స్పీచ్ అనంతరం.. సడన్‌గా ఓ యువతి స్టేజ్‌పై దర్శనమిచ్చి.. పాకిస్థాన్ జిందాబాద్ అంటూ నినాదాలు ఇవ్వసాగింది. దీంతో ఆమెపై దేశ ద్రోహం కేసు నమోదైంది.