“మహా”లో లుకలుకలు.. ఉద్దవ్‌పై శరద్ పవార్ అసంతృప్తి.. నెక్ట్స్ ఏంటీ..?

| Edited By:

Feb 15, 2020 | 7:59 AM

మహారాష్ట్రలో అప్పుడే లుకలుకలు మొదలయ్యాయి. సీఎం ఉద్దవ్ థాక్రేపై.. ఎన్సీపీ అధినేత శరద్ పవార్ తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. వీరిద్దరి మధ్య.. ఎల్గార్ పరిషత్ కేసు చిచ్చు పెట్టింది. ఎల్గార్ పరిషత్‌కు సంబంధించిన కేసును.. సీఎం ఉద్ధవ్ థాక్రే ఎన్‌ఐఏకి అప్పగించారు. దీనిపై శరద్ పవార్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎల్గార్ పరిషత్ కేసును ఎన్‌ఐఏకు అప్పగించాలని కేంద్రం నిర్ణయం తీసుకోవడం దారుణమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం దీనికి గ్రీన్ సిగ్నల్ చెప్పడం మరీ దారుణమన్నారు. […]

మహాలో లుకలుకలు.. ఉద్దవ్‌పై శరద్ పవార్ అసంతృప్తి.. నెక్ట్స్ ఏంటీ..?
Follow us on

మహారాష్ట్రలో అప్పుడే లుకలుకలు మొదలయ్యాయి. సీఎం ఉద్దవ్ థాక్రేపై.. ఎన్సీపీ అధినేత శరద్ పవార్ తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. వీరిద్దరి మధ్య.. ఎల్గార్ పరిషత్ కేసు చిచ్చు పెట్టింది. ఎల్గార్ పరిషత్‌కు సంబంధించిన కేసును.. సీఎం ఉద్ధవ్ థాక్రే ఎన్‌ఐఏకి అప్పగించారు. దీనిపై శరద్ పవార్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

ఎల్గార్ పరిషత్ కేసును ఎన్‌ఐఏకు అప్పగించాలని కేంద్రం నిర్ణయం తీసుకోవడం దారుణమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం దీనికి గ్రీన్ సిగ్నల్ చెప్పడం మరీ దారుణమన్నారు. ఇది లోలోపల అంటే ఏదో అనుకోవచ్చు.. కానీ శరద్ పవార్ ఇదంతా బహిరంగంగానే అంటూ.. తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. శాంతిభద్రతలు అనేది రాష్ట్ర పరిధిలోని అంశమని.. కేంద్రం ఆ పరిధిలోకి చొచ్చుకొని రావడం దారుణమన్నారు. శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ సారథ్యంలో మహా వికాస్ అగాఢీ సేనగా ఏర్పడిన తర్వాత శరద్ పవార్ ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేయడం ఇదే ప్రథమం.