సాధువుల హత్యలను రాజకీయం చేయడానికి ఇది సమయం కాదు..!

| Edited By: Pardhasaradhi Peri

Apr 21, 2020 | 10:15 PM

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించి పాల్‌ఘర్‌ ఘటన గురించి తెలిసిందే. ఇద్దరు సాధువులతోపాటు.. ఓ డ్రైవర్‌ను పాలఘర్ సమీపంలో గ్రామస్ధులు మూకదాడి చేసి హతమార్చారు. ఈ ఘటనపై మహారాష్ట్రలో రాజకీయ దుమారం రేగింది. ఎన్సీపీ అధినేత శరద్ పవార్ సాధువుల హత్యలపై స్పందించారు. సాధువులపై మూకదాడిని ఖండించిన ఆయన.. రాజకీయాలు చేయడానికి ఇది సరైన సమయం కాదన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపులో లేవన్న ప్రతిపక్షాల ఆరోపణలను తిప్పికొట్టారు. పుకార్ల కారణంగాతోనే సాధువులపై దాడి జరిగిందని.. విషయం […]

సాధువుల హత్యలను రాజకీయం చేయడానికి ఇది సమయం కాదు..!
Follow us on

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించి పాల్‌ఘర్‌ ఘటన గురించి తెలిసిందే. ఇద్దరు సాధువులతోపాటు.. ఓ డ్రైవర్‌ను పాలఘర్ సమీపంలో గ్రామస్ధులు మూకదాడి చేసి హతమార్చారు. ఈ ఘటనపై మహారాష్ట్రలో రాజకీయ దుమారం రేగింది. ఎన్సీపీ అధినేత శరద్ పవార్ సాధువుల హత్యలపై స్పందించారు. సాధువులపై మూకదాడిని ఖండించిన ఆయన.. రాజకీయాలు చేయడానికి ఇది సరైన సమయం కాదన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపులో లేవన్న ప్రతిపక్షాల ఆరోపణలను తిప్పికొట్టారు. పుకార్ల కారణంగాతోనే సాధువులపై దాడి జరిగిందని.. విషయం తెలిసిన వెంటనే తమ సంకీర్ణ ప్రభుత్వం నిందితులను అరెస్ట్ చేసిందన్నారు. మొత్తం 110 మందిని అరెస్టచేయగా.. అందులో తొమ్మిది మంది మైనర్లు ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. వారిని జువైనల్‌కు తరలించారు. ఇక మిగిలిన వారిని ఏప్రిల్ 30 వరకు పోలీస్ కస్టడీలో ఉంచనున్నారు. కాగా.. ఘటన జరుగుతున్నప్పుడు పోలీసులు అక్కడే ఉండి నిర్లక్ష్యం వహించారన్న ఆరోపణలపై ఇద్దరు పోలీసులను ప్రభుత్వం సస్పెండ్‌ చేసింది.