Watch Video: క్లాస్‌రూంలో విద్యార్థులంతా భోజనం చేస్తున్నారు.. రెప్పపాటులో షాకింగ్ సీన్.. ఒళ్లు జలదరించే వీడియో

|

Jul 20, 2024 | 1:45 PM

అదొక పేరు మోసిన స్కూల్.. విద్యార్థులు ఎప్పటిలానే స్కూలుకు వెళ్లారు. మధ్యాహ్నం అయింది.. లంచ్ బ్రేక్ ఇచ్చారు. పిల్లలంతా సంతోషంతో తెచ్చుకున్న లంచ్ బాక్స్ లను ఓపెన్ చేసి.. క్లాస్ రూంలోనే భోజనం చేస్తున్నారు.. వాళ్ల మాటలు అరుపులతో సందడి నెలకొంది.. ఈ క్రమంలోనే.. హఠాత్తుగా

Watch Video: క్లాస్‌రూంలో విద్యార్థులంతా భోజనం చేస్తున్నారు.. రెప్పపాటులో షాకింగ్ సీన్.. ఒళ్లు జలదరించే వీడియో
Classroom Wall Collapses
Follow us on

అదొక పేరు మోసిన స్కూల్.. విద్యార్థులు ఎప్పటిలానే స్కూలుకు వెళ్లారు. మధ్యాహ్నం అయింది.. లంచ్ బ్రేక్ ఇచ్చారు. పిల్లలంతా సంతోషంతో తెచ్చుకున్న లంచ్ బాక్స్ లను ఓపెన్ చేసి.. క్లాస్ రూంలోనే భోజనం చేస్తున్నారు.. వాళ్ల మాటలు అరుపులతో సందడి నెలకొంది.. ఈ క్రమంలోనే.. హఠాత్తుగా క్లాస్ రూం గోడ కూలిపోయింది.. దీంతోపాటు.. పలువురు విద్యార్థులు కూడా కిందపడి శిథిలాల కింద చిక్కుకుని.. స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఈ షాకింగ్ ఘటన గుజరాత్‌లోని వడోదరలో శుక్రవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది.

రెప్పపాటులో విద్యార్థులకు పెను ప్రమాదం తప్పింది. వాఘోడియా రోడ్డులోని శ్రీ నారాయణ్‌ విద్యాలయ స్కూల్‌లోని నిన్న ఒక్కసారిగా గోడ కూలింది. ఈ ప్రమాదంలో పలువురు విద్యార్థులకు స్వల్ప గాయాలయ్యాయి. లంచ్‌ బ్రేక్ సమయంలో విద్యార్థులు క్లాస్‌లో భోజనం చేస్తుండగా.. ఉన్నట్టుండి గోడ కూలింది.. ఫస్ట్‌ ఫ్లోర్‌ నుంచి కింద పడిన విద్యార్థులను వెంటనే ఆస్పత్రికి తరలించారు. లంచ్‌ బ్రేక్‌ సమయంలో ఈ ఘటన జరిగింది. గోడ కూలడంతో విద్యార్థులకు సంబంధించిన సైకిళ్లు ధ్వంసమయ్యాయి.

వీడియో చూడండి..

పాఠశాల మొదటి అంతస్తులో శుక్రవారం మధ్యాహ్నం సుమారు 12:30 గంటలకు, తరగతి గదిలో విద్యార్థులు భోజనం చేస్తుండగా.. ఈ ఘటన జరిగిందని.. ఒక విద్యార్థి తీవ్రంగా గాయపడ్డాడని అధికారులు తెలిపారు. సైకిల్ పార్క్ చేయడానికి వచ్చిన విద్యార్థిపై గోడ కూలిపోయిందన్నారు. ఎవరికీ తీవ్ర గాయాలు కాలేదని తెలిపారు.

ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్‌గా అవుతోంది.. అధికారుల ప్రకారం.. పాఠశాల 2002-2003లో నిర్మించారు.. సమాచారం అందుకున్న వడోదర అగ్నిమాపక శాఖ బృందం పాఠశాలకు చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..