పొలాల్లో ప్రత్యక్షమైన మొసలి.. షాక్‌ తిన్న స్థానికులు..

| Edited By:

Jul 19, 2020 | 4:28 AM

గుజరాత్‌లో మరోసారి పొలాల్లో మొసలి ప్రత్యక్షమవ్వడంతో స్థానికులు భయబ్రాంతులకు గురయ్యారు. ఈ సంఘటన రాష్ట్రంలోని వడోదర జిల్లాలో చోటుచేసుకుంది. కేలన్‌పూర్‌లోని గ్రామ శివారు పొలాల్లో ఓ మొసలి ప్రత్యక్షమైంది. దీనిని..

పొలాల్లో ప్రత్యక్షమైన మొసలి.. షాక్‌ తిన్న స్థానికులు..
Follow us on

గుజరాత్‌లో మరోసారి పొలాల్లో మొసలి ప్రత్యక్షమవ్వడంతో స్థానికులు భయబ్రాంతులకు గురయ్యారు. ఈ సంఘటన రాష్ట్రంలోని వడోదర జిల్లాలో చోటుచేసుకుంది. కేలన్‌పూర్‌లోని గ్రామ శివారు పొలాల్లో ఓ మొసలి ప్రత్యక్షమైంది. దీనిని చూసిన రైతుల షాక్ తిన్నారు. వెంటనే స్థానిక పోలీసులకు, అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. అయితే కొందరు స్థానికులు ధైర్యం చేసి.. పొలంలోనే తాళ్లతో బంధించారు. ఆ తర్వాత ఆ మొసలిని అటవీ శాఖ అధికారులకు అప్పగించారు. దీని పొడవు ఏడు అడుగులు ఉన్నట్లు అటవీ శాఖ అధికారులు తెలిపారు. తమకు గ్రామస్థులు మొసలి ఉందని సమాచారం అందించారని.. దీంతో తాము వెంటనే గ్రామానికి చేరుకున్నామంటూ జాతీయ న్యూస్ ఏజెన్సీకి అటవీ శాఖ అధికారులు వివరించారు. మొసళ్లను పట్టుకునే ముందు జాగ్రత్తగా ఉండాలని.. అవి మనుషులపై దాడికి పాల్పడుతాయని తెలిపారు. మనం వాటిని రక్షిస్తున్నామన్న విషయం తెలియదని.. అవి కూడా ఆత్మ రక్షణకు దాడికి దిగుతాయని తెలిపారు.

కాగా, వడోదర ప్రాంతంలో ఇలా మొసళ్లు ప్రత్యక్షమవ్వడం ఇదే తొలిసారి కాదని.. గతంలో కూడా పలు గ్రామాల్లో మొసళ్లు వచ్చాయని అధికారులు తెలిపారు.