Wayanad Landslide: వయనాడ్‌ బాధితులకు అండగా నిలుస్తోన్న సేవా భారతి వాలంటీర్లు

|

Jul 31, 2024 | 2:00 PM

బాధితులకు అండగా నిలిచేందుకు ఆర్మీ, నేవీ, నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (NDRF)ల నుంచి భారీ సంఖ్యలో రెస్క్యూ టీమ్‌లు సహాయం కోసం రంగంలోకి దిగాయి. ఉపబలాల్లో కన్నూర్‌లోని DSC సెంటర్ నుంచి సుమారు 200 మంది భారతీయ ఆర్మీ సిబ్బంది, కోజికోడ్ నుంచి 122 TA బెటాలియన్, అలాగే రెండు వైమానిక దళ హెలికాప్టర్లు...

Wayanad Landslide: వయనాడ్‌ బాధితులకు అండగా నిలుస్తోన్న సేవా భారతి వాలంటీర్లు
Wayanad
Follow us on

కేరళలో కురుస్తున్న భారీ వర్షాలతో ప్రజా జీవనం అతలాకుతలమైంది. గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా వాయనాడ్ జిల్లాలో పలుచోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ విపత్తు కారణంగా ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 148కి చేరింది. వందలాది మంది గాయపడ్డారు, ఇక కొందరు చిక్కుకుపోయారు. కొండచరియలు విరిగిపడడం వల్ల భారీ విధ్వంసానికి దారి తీసింది. చెట్లు, ఇళ్లు కూలిపోయాయి. వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి.

బాధితులకు అండగా నిలిచేందుకు ఆర్మీ, నేవీ, నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (NDRF)ల నుంచి భారీ సంఖ్యలో రెస్క్యూ టీమ్‌లు సహాయం కోసం రంగంలోకి దిగాయి. ఉపబలాల్లో కన్నూర్‌లోని DSC సెంటర్ నుంచి సుమారు 200 మంది భారతీయ ఆర్మీ సిబ్బంది, కోజికోడ్ నుంచి 122 TA బెటాలియన్, అలాగే రెండు వైమానిక దళ హెలికాప్టర్లు, ఒక Mi-17, ఒక ALH, వైమానిక రెస్క్యూ ప్రయత్నాలను సమన్వయం చేస్తున్నారు.

ఇక రెస్క్యూ ఆపరేషన్‌లో భాగంగా ఎన్‌డీఆర్‌ఎఫ్‌తో పాటు భారతి వాలంటీర్లు సైతం పాల్గొన్నారు. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సభ్యులు కూడా బాధితులకు అండగా నిలుస్తున్నారు. ఈ వాలంటీర్లు మరణించిన వారిని గుర్తించడంలో NDRF బృందాలకు సహాయం చేస్తున్నారు. అలాగే సర్వస్వం కోల్పోయిన వారికి ఆహారంతో ఆశ్రయం కల్పిస్తున్నారు. ఆహార శిబిరాలను ఏర్పాటు చేస్తున్నారు. తప్పిపోయిన వారికి సైతం సాయం చేస్తున్నారు. ఇక మరణించిన వారి అంత్యక్రియలకు సైతం సహకరిస్తున్నారు.

వాయాడ్‌కు చుట్టు పక్కల ప్రాంతాల నుంచి వందలాది మంది స్వయంసేవకులు సాయం అందించడానికి వస్తున్నారు. ప్రమాదంలో ఇరుక్కున్న వారికి సాయం అందించేందుకు అవిశ్రాంతంగా కృషి చేస్తున్నారు. అలాగే గాయపడిన వ్యక్తులను ఆసుపత్రులకు తరించేందుకు సహాయం చేస్తున్నారు. క్షతగాత్రులకు సకాలంలో వైద్యం అందేలా సాయం చేస్తున్నారు. ఆసుపత్రుల్లో కూడా గాయపడిన వారికి ఆహారం ఏర్పాటు చేస్తున్నారు.

 

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..