తీవ్ర అస్వస్థతకు గురైన సీనియర్‌ నటి…వెంటిలేటర్‌పై చికిత్స

|

Jul 08, 2020 | 5:32 PM

తెలుగు సహా కన్నడ, తమిళ, మలయాళ, మరాఠి భాషా చిత్రాల్లో నటించిన సీనియర్‌ నటి జయంతి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు ఆమెను ఆస్పత్రిలో చేర్పించారు.

తీవ్ర అస్వస్థతకు గురైన సీనియర్‌ నటి...వెంటిలేటర్‌పై చికిత్స
Follow us on

తెలుగు సహా కన్నడ, తమిళ, మలయాళ, మరాఠి భాషా చిత్రాల్లో నటించిన సీనియర్‌ నటి జయంతి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు ఆమెను ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం ఆమె వెంటిలేటర్ మీద ఉన్నట్లు సమాచారం. శ్వాస సంబంధ సమస్యతో ఇబ్బంది పడటంతో జయంతిని మంగళవారం హుటాహుటిన ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. 35 ఏళ్లుగా ఆమె ఆస్తమాతో బాధపడుతున్నట్లు సన్నిహితులు పేర్కొన్నారు. ప్రస్తుతం వెంటిలేటర్ మీద చికిత్స అందిస్తున్నామని డాక్టర్లు తెలిపారు. ఆమె ఆరోగ్య పరిస్థితిని 24 గంటల పాటు పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు.

1949 జనవరి 6న శ్రీకాళహస్తిలో జన్మించిన జయంతి, దక్షిణాది భాషలన్నింటితో పాటు హిందీలోను కలిపి 500 చిత్రాలకు పైగా నటించారు. దశాబ్ధాల పాటు వెండితెర మీద ఎన్నో అద్భుతపాత్రల్లో నటించి మెప్పించారు.