వైష్ణోదేవి భక్తులకు రైల్వే కానుక.. ఇక కేవలం 8గంటల్లోనే..!

| Edited By:

Oct 03, 2019 | 10:36 AM

మేక్ ఇన్ ఇండియాలో భాగంగా బుల్లెట్‌ ట్రైన్‌లా దూసుకెళ్లే వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌లను భారత్‌లోనే తయారు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పటికే తొలి వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్ ఢిల్లీ-వారణాసి మధ్య నడుస్తుంది. తాజాగా మరో ట్రైన్ కూడా పట్టాలెక్కబోతోంది. అది కూడా ఢిల్లీ-కట్రా మార్గంలో నడవబోతోంది. నవరాత్రుల సందర్భంగా వైష్ణోదేవీ భక్తుల కోసం మరో వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ను ఇవాళ రైల్వే శాఖ ప్రారంభించింది.కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా పచ్చజెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మట్లాడిన అమిత్ […]

వైష్ణోదేవి భక్తులకు రైల్వే కానుక.. ఇక కేవలం 8గంటల్లోనే..!
Follow us on

మేక్ ఇన్ ఇండియాలో భాగంగా బుల్లెట్‌ ట్రైన్‌లా దూసుకెళ్లే వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌లను భారత్‌లోనే తయారు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పటికే తొలి వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్ ఢిల్లీ-వారణాసి మధ్య నడుస్తుంది. తాజాగా మరో ట్రైన్ కూడా పట్టాలెక్కబోతోంది. అది కూడా ఢిల్లీ-కట్రా మార్గంలో నడవబోతోంది. నవరాత్రుల సందర్భంగా వైష్ణోదేవీ భక్తుల కోసం మరో వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ను ఇవాళ రైల్వే శాఖ ప్రారంభించింది.కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా పచ్చజెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మట్లాడిన అమిత్ షా మేడ్ ఇన్ ఇండియా రైళును ప్రారంభించడం ఎంతో గర్వంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో రైల్వే మంత్రి పీయూష్ గోయల్, జితేంద్ర సింగ్, హర్ష వర్ధన్ సింగ్‌ పాల్గొన్నారు.

ఇక ఈ ట్రైన్ ట్రయల్ రన్ గత నెలలోనే ఢిల్లీ- కట్రా మార్గంలో పూర్తి చేశామని.. రైల్వేబోర్డు ఛైర్మన్ వెల్లడించారు. మంగళవారం మినహా.. మిగతా అన్ని రోజులు వందేభారత్ ఎక్స్‌ప్రెస్ నడుస్తుందని తెలిపారు. ఢిల్లీ నుంచి కట్రా ప్రయాణించేందుకు టికెట్ ధర రూ. 1600/- నుంచి రూ.3000/- వరకు ఉంటుందన్నారు. ఇక రాబోయే రోజుల్లో దేశంలో రద్దీగా మార్గాల్లో ఈ వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌లను నడుపుతామని.. ప్రస్తుతం ఢిల్లీ-ముంబై, ఢిల్లీ-హౌరా రైలుమార్గాల్లో వచ్చే డిసెంబర్ నాటికి ఈ ఎక్స్‌ప్రెస్‌లు నడపనున్నట్లు తెలిపారు. దేశంలో 2022 కల్లా 40 వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు నడపాలని లక్ష్యంగా పెట్టుకున్నామని రైల్వేబోర్డు అధికారులు తెలిపారు.