ప్రజలు ఇలా చనిపోతూనే ఉండాలా ..? గుజరాత్ ప్రభుత్వంపై సుప్రీంకోర్టు మండిపాటు

| Edited By: Anil kumar poka

Jul 19, 2021 | 4:12 PM

గుజరాత్ ప్రభుత్వంపై సుప్రీంకోర్టు మండిపడింది. కోవిడ్ ఆసుపత్రుల్లో అగ్నిప్రమాదాలు జరగకుండా భద్రతా చర్యలు తీసుకోవాలన్న తమ ఉత్తర్వులను మార్చుతూ ఓ నోటిఫికేషన్ జారీ చేయడంపై కోర్టు ఆ ప్రభుత్వాన్ని తీవ్రంగా తప్పు పట్టింది.

ప్రజలు ఇలా చనిపోతూనే ఉండాలా ..? గుజరాత్ ప్రభుత్వంపై సుప్రీంకోర్టు మండిపాటు
Supreme Court
Follow us on

గుజరాత్ ప్రభుత్వంపై సుప్రీంకోర్టు మండిపడింది. కోవిడ్ ఆసుపత్రుల్లో అగ్నిప్రమాదాలు జరగకుండా భద్రతా చర్యలు తీసుకోవాలన్న తమ ఉత్తర్వులను మార్చుతూ ఓ నోటిఫికేషన్ జారీ చేయడంపై కోర్టు ఆ ప్రభుత్వాన్ని తీవ్రంగా తప్పు పట్టింది. హాస్పిటల్స్ లో జరుగుతున్న అగ్నిప్రమాదాల్లో ఎంతోమంది రోగులు మరణిస్తున్న ఘటనలు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది. అగ్ని ప్రమాదాల నివారణ చర్యలు చేపట్టేందుకు తమకు సమయం కావాలని చెప్పడం ఓ సాకుగా ఉందని, అంటే రోగులు లేదా హాస్పిటల్ సిబ్బంది చనిపోయేంతవరకు మీరు చర్యలు తీసుకోరా అని న్యాయమూర్తులు జస్టిస్ వై.వి. చంద్రచూడ్, జస్టిస్ షా ప్రశ్నించారు. 2022 వరకు మీరు మా ఉత్తర్వులను అతిక్రమిస్తూనే ఉంటారా అని వారన్నారు. నాసిక్ లో కోవిడ్ నుంచి కోలుకున్న ఓ రోగి మరునాడే డిశ్చార్జ్ కావలసి ఉండిందని, అతనికి సేవలు చేసిన ఇద్దరు నర్సులు వాష్ రూమ్ కి వెళ్లగా షార్ట్ సర్క్యూట్ కారణంగానో మరో కారణం వల్లో అగ్నిప్రమాదం జరిగి ముగ్గురూ మరణించారని కోర్టు పేర్కొంది. ఆస్పత్రులు పెద్ద రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీగా మారాయని న్యాయమూర్తులు దుయ్యబట్టారు.

చిన్న చిన్న ఆసుపత్రులు, కేవలం నాలుగు గదులు మాత్రమే ఉన్నవాటిని వెంటనే మూసివేయాలని వారు ఆదేశించారు. మీరు జారీ చేసిన నోటిఫికేషన్ కి ఓ అఫిడవిట్ రూపంలో సంజాయిషీ ఇవ్వాలని వారు గుజరాత్ ప్రభుత్వాన్ని ఆదేశించారు. అలాగే ఫైర్ సేఫ్టీపై గత డిసెంబరు నుంచి ఇప్పటివరకు మీరు తీసుకున్నచర్యలను వివరించాలని కూడా సూచించారు. తమకు కొంత వ్యవధి కావాలన్న ప్రభుత్వ విజ్ఞప్తిని కోర్టు తిరస్కరించింది. రాజ్ కోట్ లోని ఓ ఆసుపత్రిలో గత నవంబరులో ఆరుగురు అగ్నిప్రమాదంలో మరణించగా..భరూచ్ లో గత మే నెలలో జరిగిన ఫైర్ యాక్సిడెంట్ లో 18 మంది మృతి చెందారు.

మరిన్ని ఇక్కడ చూడండి : Anushka Shetty Video:స్వీటీ మూవీ పై గుసగుసలు.. అనుష్క సినిమా ఆగిపోయిందా..(వీడియో).

 ఒకే మహిళ.. రెండు కరోనా వేరియంట్లు..షాక్ అయిన వైద్యులు…ఎక్కడో తెలుసా..?:Belgian Woman Two Variants Video.

 హైదరాబాద్ లో ఆశర్యం..!బాబోయ్…సమాధి కింద శవం..! పదేళ్లయినా చెక్కుచెదరని శరీరం..:Hyderabad.

 వర్క్ ఫ్రమ్ హోం ఉద్యోగులకు గ్రేట్ గుడ్ న్యూస్.. వచ్చే రెండేళ్లపాటు రిమోట్ పని..:Knowlodge Video.