Manipur High Court Chief Justice: మణిపూర్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ సంజయ్‌ కుమార్‌

|

Jan 26, 2021 | 5:32 AM

Manipur High Court Chief Justice: పంజాబ్ - హ‌ర్యానా హైకోర్టు న్యాయ‌మూర్తిగా ఉన్న‌ జ‌స్టిస్ పీవీ సంజ‌య్ కుమార్‌కు మ‌ణిపూర్ హైకోర్టు సీజేగా ప‌దోన్న‌తి..

Manipur High Court Chief Justice: మణిపూర్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ సంజయ్‌ కుమార్‌
Follow us on

Manipur High Court Chief Justice: పంజాబ్ – హ‌ర్యానా హైకోర్టు న్యాయ‌మూర్తిగా ఉన్న‌ జ‌స్టిస్ పీవీ సంజ‌య్ కుమార్‌కు మ‌ణిపూర్ హైకోర్టు సీజేగా ప‌దోన్న‌తి ల‌భించింది. సీజేఐ బాబ్డే నేతృత్వంలో ఐదుగురు స‌భ్యుల‌తో కూడిన కొలీజియం డిసెంబ‌ర్ 16న స‌మావేశ‌మై ఈ ప్ర‌తిపాద‌న‌కు ఆమోదం తెలిపిన విష‌యం తెలిసిందే. అయితే ఈ నిర్ణ‌యాన్ని సుప్రీం కోర్టు సోమ‌వారం ప్ర‌క‌టించింది. జ‌స్టిస్ సంజ‌య్ కుమార్ 1963 ఆగ‌స్టు 14న జ‌న్మించారు.

ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ హైకోర్టులో 2000-03లో ప్ర‌భుత్వ ప్రాసిక్యూట‌ర్‌గా ప‌ని చేశారు. 2008 ఆగ‌స్టు8న ఆయ‌న‌కు అదే హైకోర్టులో అద‌న‌పు జ‌డ్జిగా ప‌దోన్న‌తి ల‌భించింది. 2010 జ‌న‌వ‌రి 20న శాశ్వ‌త జ‌డ్జి అయ్యారు. జ‌స్టిస్ సంజ‌య్ కుఆర్ 2019 అక్టోబ‌ర్ 14న పంజాబ్‌, హ‌ర్యానా హైకోర్టు న్యాయ‌మూర్తిగా బాధ్య‌త‌లు చేప‌ట్టారు. తాజాగా మ‌ణిపూర్ హైకోర్టు సీజేగా ప‌దోన్న‌తి లభించింది.

Also Read:

Bombay High Court: లైంగిక వేధింపుల కేసులో ముంబై హైకోర్టు సంచలన తీర్పు.. వెల్లువెత్తుతున్న విమర్శలు..

ఢిల్లీ వీధుల్లో రంకెలు వేయనున్న లేపాక్షి బసవన్న.. గణతంత్ర దినోత్సవ వేడుకల్లో కనువిందు చేయనున్న శకటం