sasikala natarajan : క్షీణించిన చిన్నమ్మ ఆరోగ్యం.. ఊపిరితిత్తులు దెబ్బతిన్నాయని తెలిపిన వైద్యులు..

|

Jan 23, 2021 | 5:36 AM

అన్నాడీఎంకే మాజీ నాయకురాలు  శశికళ ఆరోగ్యం క్షీణించిందని విక్టోరియా ఆస్పత్రి వైద్యులు శుక్రవారం వెల్లడించారు. ఆమె ఊపిరితిత్తులు బాగా దెబ్బతిన్నట్టు వైద్యవర్గాల ద్వారా తెలుస్తోంది.

sasikala natarajan :  క్షీణించిన చిన్నమ్మ ఆరోగ్యం.. ఊపిరితిత్తులు దెబ్బతిన్నాయని తెలిపిన వైద్యులు..
Follow us on

sasikala natarajan : అన్నాడీఎంకే మాజీ నాయకురాలు శశికళ ఆరోగ్యం క్షీణించిందని విక్టోరియా ఆస్పత్రి వైద్యులు శుక్రవారం వెల్లడించారు. ఆమె ఊపిరితిత్తులు బాగా దెబ్బతిన్నట్టు వైద్యవర్గాల ద్వారా తెలుస్తోంది. అక్రమాస్తుల కేసులో పరప్పన అగ్రహార జైలులో శిక్ష అనుభవిస్తున్న శశికళ మూడు రోజులుగా అనారోగ్యంతో ఉన్న విషయం తెలిసిందే.  కాగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తడంతో బుధవారం ఆమెను పరప్పన అగ్రహార జైలు నుంచి బెంగళూరులోని ఆసుపత్రి తరలించారు. గురువారం రాత్రి ఆమెకు కొవిడ్‌-19 పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం క్షీణించిందని ఊపిరితిత్తులు దెబ్బతిన్నాయని, మధుమేహం, రక్తపోటు కూడా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. శశికళ ఈ నెల 27న విడుదల కావాల్సి ఉంది. ఈ సమయంలో ఆమె అస్వస్థతకు గురికావడం ఆందోళనతో ఆమె అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు.