Salon Woner Free Services: వినూత్న ఆలోచన.. కూతురు పుట్టిందని సంతోషంతో ఉచితంగా సెలూన్‌ సేవలు

|

Jan 05, 2021 | 11:58 PM

Salon Woner Free Services: సాధారణంగా ఆడ పిల్ల పుట్టిందంటే చాలు తల్లిదండ్రులు కాస్త నిరుత్సాహ పడుతుంటారు. అయితే మధ్యప్రదేశ్‌కు చెందిన ఓ మహిళ ఆడ పిల్లకు ...

Salon Woner Free Services: వినూత్న ఆలోచన.. కూతురు పుట్టిందని సంతోషంతో ఉచితంగా సెలూన్‌ సేవలు
Follow us on

Salon Woner Free Services: సాధారణంగా ఆడ పిల్ల పుట్టిందంటే చాలు తల్లిదండ్రులు కాస్త నిరుత్సాహ పడుతుంటారు. అయితే మధ్యప్రదేశ్‌కు చెందిన ఓ మహిళ ఆడ పిల్లకు జన్మనివ్వడంతో తల్లిదండ్రులు పట్టలేని సంతోషానికి లోనయ్యారు. సెలూన్‌ యజమాని అయిన శిశువు తండ్రి.. ఆయన షాపుల్లో ఒక రోజు ఉచితంగా సేవలందించాడు. మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌కు చెందిన సెలూన్‌ యజమాని సల్మాన్‌కు మూడు షాపులున్నాయి. అయితే డిసెంబర్‌ 26న ఆయన భార్య పండంటి ఆడ బిడ్డకు జన్మనిచ్చింది.

ఆడబిడ్డ పుట్టిందని ఏ మాత్రం బాధపడకుండా సంతోషం వ్యక్తం చేశాడు. దీంతో వినూత్నంగా ఆలోచించాడు. ఆడబిడ్డ పుట్టిన సందర్భంగా జనవరి 4న ఉచితంగా సెలూన్‌ సేవలు పొందవచ్చంటూ తన మూడు షాపుల వద్ద బ్యానర్లు ఏర్పాటు చేశాడు. ఆ మేరకు సోమవారం సుమారు 80 మందికిపైగా ఉచితంగా సెలూన్‌ సేవలు అందించాడు.

ఆడపిల్లలు పుట్టుక ఎంతో ఆనందాన్ని ఇస్తుందనే సందేశాన్ని ఇవ్వాలనుకున్నాను.. ఆ సంతోషాన్ని ఇలా పంచుకున్నాను. అమ్మాయి పుట్టినప్పుడు ఎవరూ బాధపడకూడదు. సంతోషంతో స్వాగతం పలకాలి అంటూ సెలూన్‌ యజమాని సల్మాన్‌ చెప్పాడు.

 

Om Birla Daughter: సివిల్ సర్వీసస్‌కు లోక్‌సభ స్పీకర్ కుమార్తె.. తొలి ప్రయత్నంలోనే విజయం..