Sadhguru: మహిళలపై జరుగుతున్న నేరాలపై జాతీయ ఏజెన్సీని ఏర్పాటు చేయాలి: ఆధ్యాత్మిక గురువు సద్గురు

|

Aug 17, 2024 | 11:43 AM

మహిళలపై జరిగిన నేరాలను పరిష్కరించడానికి జాతీయ ఏజెన్సీని ఏర్పాటు చేయాలని ఆధ్యాత్మిక గురువు సద్గురు అన్నారు. కోల్‌కతా అత్యాచారం-హత్య సంఘటన తర్వాత సద్గురు తన స్వరాన్ని పెంచారు. ఈ ఘటనపై అధికారులు చర్యలు తీసుకోవాలని సద్గురు కోరారు. కోల్‌కతాలో ఒక వైద్యురాలిపై జరిగిన ఘోరమైన అత్యాచార ఘటన నేపథ్యంలో మహిళలపై నేరాలను పరిష్కరించడానికి అంకితమైన జాతీయ..

Sadhguru: మహిళలపై జరుగుతున్న నేరాలపై జాతీయ ఏజెన్సీని ఏర్పాటు చేయాలి: ఆధ్యాత్మిక గురువు సద్గురు
Sadhguru
Follow us on

మహిళలపై జరిగిన నేరాలను పరిష్కరించడానికి జాతీయ ఏజెన్సీని ఏర్పాటు చేయాలని ఆధ్యాత్మిక గురువు సద్గురు అన్నారు. కోల్‌కతా అత్యాచారం-హత్య సంఘటన తర్వాత సద్గురు తన స్వరాన్ని పెంచారు. ఈ ఘటనపై అధికారులు చర్యలు తీసుకోవాలని సద్గురు కోరారు. కోల్‌కతాలో ఒక వైద్యురాలిపై జరిగిన ఘోరమైన అత్యాచార ఘటన నేపథ్యంలో మహిళలపై నేరాలను పరిష్కరించడానికి అంకితమైన జాతీయ ఏజెన్సీని స్థాపించాలని సద్గురు పిలుపునిచ్చారు. పెరుగుతున్న ప్రజల ఆగ్రహం, భారతదేశంలో మహిళల రక్షణ కోసం మరింత కఠినమైన చర్యల కోసం డిమాండ్ల మధ్య సద్గురు ఈ ప్రటకన చేశారు.

ఈ సందర్భంగా ఈ ఘటనపై సద్గురు ట్వీట్టర్‌లో స్పందించారు. ప్రస్తుతం దేశంలో  మహిళలపై ఎన్నో నేరాలు జరుగుతున్నాయి.ఈ దేశంలో మహిళలపై అత్యంత భయంకరమైన నేరాలను, రాష్ట్ర ఏజెన్సీలకు మించి పరిష్కరించడానికి ఒక జాతీయ ఏజెన్సీ ఉండాలన్నారు. అటువంటి సందర్భాలలో జోక్యం చేసుకునే అధికారం కలిగిన కేంద్రీకృత సంస్థ దేశవ్యాప్తంగా మహిళలకు త్వరిత న్యాయాన్ని, మెరుగైన రక్షణను అందిస్తుందన్నారు.

కాగా, కోల్‌కతా ప్రభుత్వ ఆసుపత్రిలో మహిళా ట్రైనీ డాక్టర్‌పై దారుణంగా అత్యాచారం చేసి హత్య చేసిన ఘటన దేశాన్ని కుదిపేసింది. మరోవైపు కోల్‌కతా ప్రభుత్వ ఆసుపత్రిపై ఓ మిస్టరీ ముఠా దాడి చేసి హత్య జరిగిన ప్రదేశంలో సాక్ష్యాలను ధ్వంసం చేసేందుకు ప్రయత్నించడం తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. దీనికి నిరసనగా దేశవ్యాప్తంగా వైద్యులు 24 గంటల సమ్మె చేస్తున్నారు. దీంతో నేడు వైద్యసేవలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా నేరస్తులకు గరిష్ట శిక్ష విధించాలని పట్టుబట్టి ఈ రోజు నిరసనలో పాల్గొంటానని ప్రకటించారు.

పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతాలోని ఆర్‌జి గఢ్ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో 9వ తేదీన మహిళా డాక్టర్‌పై లైంగిక దాడి చేసి హత్య చేశారు. హత్యకు గురైన మహిళా డాక్టర్ అక్కడ పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడిసిన్ చదువుతోంది. అనంతరం హత్యకు గురైన మహిళా వైద్యురాలి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.

 


మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి