మళ్ళీ తెరమీదికి ఇద్దరు పిల్లల లిమిట్.. ఆర్ఎస్ఎస్ ఎజెండా ఇదే

|

Jan 17, 2020 | 6:13 PM

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ దేశ జనాభా నియంత్రణపై దృష్టి సారించింది. ఈ విషయాన్ని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ స్వయంగా వెల్లడించారు. దేశ జనాభా విపరీతంగా పెరిగిపోతున్న నేపథ్యంలో ఇద్దరు పిల్లల నిబంధనను ఖచ్చితంగా అమలు చేయాలని ఆయన నొక్కి చెప్పారు. ఇందుకోసం కేవలం ప్రచారంపై ఆధారపడకుండా.. చట్టం చేయాలని మోహన్ భగవత్ అన్నారు. ఆర్ఎస్ఎస్ చీఫ్ శుక్రవారం యుపిలోని మొరాదాబాద్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడారు. సంఘ్ పరివార్ కార్యకర్తలతో ఆయన ఇంటరాక్ట్ అయ్యారు. ఇద్దరు […]

మళ్ళీ తెరమీదికి ఇద్దరు పిల్లల లిమిట్.. ఆర్ఎస్ఎస్ ఎజెండా ఇదే
Follow us on

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ దేశ జనాభా నియంత్రణపై దృష్టి సారించింది. ఈ విషయాన్ని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ స్వయంగా వెల్లడించారు. దేశ జనాభా విపరీతంగా పెరిగిపోతున్న నేపథ్యంలో ఇద్దరు పిల్లల నిబంధనను ఖచ్చితంగా అమలు చేయాలని ఆయన నొక్కి చెప్పారు. ఇందుకోసం కేవలం ప్రచారంపై ఆధారపడకుండా.. చట్టం చేయాలని మోహన్ భగవత్ అన్నారు.

ఆర్ఎస్ఎస్ చీఫ్ శుక్రవారం యుపిలోని మొరాదాబాద్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడారు. సంఘ్ పరివార్ కార్యకర్తలతో ఆయన ఇంటరాక్ట్ అయ్యారు. ఇద్దరు పిల్లల నిబంధనపై చట్టం చేయాలన్నది ఆర్ఎస్ఎస్ అభిమతమని, అయితే ఈ విషయంలో తుది నిర్ణయం తీసుకోవాల్సింది కేంద్ర ప్రభుత్వమేనని ఆయన అన్నారు.

అయోధ్య రామ మందిర నిర్మాణం విషయంలో ట్రస్టు ఏర్పాటయ్యే వరకు ఆర్ఎస్ఎస్ ఫాలో అప్ చేస్తుంటుందని, ఒకసారి ట్రస్టు ఏర్పాటైతే సంఘ్ పరివార్ పాత్ర వుండబోదని మోహన్ భగవత్ చెప్పారు. అయితే మధుర, కాశీల అంశం కూడా ఆర్ఎస్ఎస్ ఎజెండాలో వున్నాయన్న ప్రచారాన్ని ఆయన కొట్టిపారేశారు.

పౌరసత్వ చట్ట సవరణకు ఆర్ఎస్ఎస్ మద్దతిస్తుందని, సంఘ్ కార్యకర్తలు దేశవ్యాప్తంగా ఈ చట్టం అవసరాన్ని గురించి ప్రచారం చేయాలని మోహన్ భగవత్ ఆదేశించారు. అయితే.. వేగంగా పెరుగుతున్న జనాభా దేశానికి ఇబ్బందికరంగా మారుతోందని, ఇది మతాలకతీతంగా నియంత్రించాల్సిన అంశమని ఆయన చెబుతున్నారు.