Mohan Bhagwat: పెళ్లి కోసం మతం మారిపోతారా..? RSS చీఫ్ మోహన్ భగవత్ తీవ్ర అసంతృప్తి

|

Oct 11, 2021 | 10:43 AM

RSS chief Mohan Bhagwat: హిందూ యువతీయువకుల మత మార్పిళ్లపై రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(RSS) చీఫ్ మోహన్ భగవత్ తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారు. పెళ్లి వంటి చిన్న కారణాలతో హిందూ యువతీయువకులు మతం మార్చుకోవడం సరికాదని అన్నారు.

Mohan Bhagwat: పెళ్లి కోసం మతం మారిపోతారా..?  RSS చీఫ్ మోహన్ భగవత్ తీవ్ర అసంతృప్తి
Mohna Bhagwat
Follow us on

RSS chief Mohan Bhagwat: హిందూ యువతీయువకుల మత మార్పిళ్లపై రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(RSS) చీఫ్ మోహన్ భగవత్ తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారు. పెళ్లి వంటి చిన్న కారణాలతో హిందూ యువతీయువకులు మతం మార్చుకోవడం సరికాదని అన్నారు. సొంత మతం, సాంప్రదాయాలపై యువతీయువకులకు గౌరవభావాన్ని నెలకొల్పాల్సిన అవసరముందన్నారు. ఉత్తరాఖండ్‌లోని హల్ద్వానిలో ఆదివారం ఆర్ఎస్ఎస్ శ్రేణులనుద్దేశించి మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. హిందూ యువతీయువకులు పెళ్లి లాంటి కారణాలతో వ్యక్తిగత స్వార్థంతో హిందూ మతాన్ని వీడి మరో మతాన్ని ఎలా స్వీకరిస్తారు? అని ప్రశ్నించారు. ఇలా చేయడం సబుకాదన్నారు. మన పిల్లలను ఆ రకంగా పెంచకూడదన్నారు. కుటుంబ విలువలు, ఆచార సాంప్రదాయాలు తెలిసేలా.. వాటిని గౌరవించేలా పిల్లలను పెంచాలని తల్లిదండ్రులకు సూచించారు. మతమార్పిళ్లకు సంబంధించి ఎవరై ప్రశ్నిస్తే ఎలాంటి గందరగోళానికి గురికాకుండా ప్రజలు సమాధానం చెప్పాలన్నారు. వీటికి సరైన రీతిలో సమాధానాలు చెప్పేందుకు ప్రజలు కూడా తగిన విషయ పరిజ్ఞానం పొందాలని సూచించారు.

సాంప్రదాయక కుటుంబ విలువలు, ఆచారాలను పరిరక్షించాల్సిన అవసరముందని మోహన్ భగవత్ సూచించారు. ఇందుకోసం భారత పర్యాటక స్థనాలను సందర్శించడం, స్వయంగా పెంచినవి తినడం, సాంప్రదాయక వస్త్రాలు ధరించడం చేయాలని సూచించారు. మన సంస్కృతితో అనుసంధానమయ్యేందుకు భాష, ఆహారం, భక్తి పాటలు, పర్యాటకం, వస్త్రధారణ, ఇళ్లు ముఖ్యమని విశ్లేషించారు. మన ఆచార వ్యవహారాలను ప్రజలు అనుసరించాలన్న మోహన్ భగవత్.. అయితే అంటరానితనం వంటి వాటిని విడనాడాలని సూచించారు.

Also Read..

PM Narendra Modi: అంతరిక్ష రంగంపై భారత్ ఫోకస్.. నేడు ఇండియన్ స్పేస్ అసోసియేషన్‌ను ప్రారంభించనున్న ప్రధాని మోదీ..

ఒక్క రోజులో 95 పరుగులు..12 వికెట్లు.. టెస్ట్ క్రికెట్‌లో అద్భుతమైన మ్యాచ్‌..