అయోధ్యకు చేరుకున్న ఆర్‌ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్‌

| Edited By:

Aug 05, 2020 | 1:32 AM

రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ చీఫ్ మోహన్‌ భగవత్‌ యూపీలోని అయోధ్యకు చేరుకున్నారు. మంగళవారం సాయంత్రమే ఆయన అయోధ్య నగరంకు చేరుకున్నారు. బుధవారం అయోధ్యలో జరగబోయే రామ..

అయోధ్యకు చేరుకున్న ఆర్‌ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్‌
Follow us on

రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ చీఫ్ మోహన్‌ భగవత్‌ యూపీలోని అయోధ్యకు చేరుకున్నారు. మంగళవారం సాయంత్రమే ఆయన అయోధ్య నగరంకు చేరుకున్నారు. బుధవారం అయోధ్యలో జరగబోయే రామ మందిర నిర్మాణా భూమి పూజ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొనబోతున్నారు. ఈ భూమి పూజ కార్యక్రమంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ, యూపీ సీఎం యోగీ ఆదిత్యానాథ్‌తో పాటు మరికొందరు రాజకీయ ప్రముఖులు కూడా పాల్గొనబోతున్నారు. ఈ విషయాన్ని శ్రీ రామజన్మ భూమి తీర్ధ క్షేత్ర ట్రస్టు తెలిపింది. ఇప్పటికే యోగీ ఆదిత్యానాథ్‌ అయోధ్యలోనే ఉంటూ.. అక్కడి కార్యక్రమాలను దగ్గర ఉండి పర్యవేక్షిస్తున్నారు. భూమి పూజ కార్యక్రమానికి 175 అతిథులకు ఆహ్వానం పంపింది ట్రస్టు. వీరిలో 135 మంది సాధు సంతువులు కాగా.. 35 మంది పలు సంస్థలకు చెందిన వారికి ఆహ్వానం పలికింది. బుధవారం నాడు భూమి పూజ కార్యక్రమంలో వీరంతా పాల్గొనబోతున్నారని రామజన్మ భూమి తీర్ధ క్షేత్ర ట్రస్టు జనరల్ సెక్రటరీ చంపత్‌ రాయ్‌ తెలిపారు.

ఇదిలావుంటే.. అయోధ్య నగరం మొత్తం రంగురంగుల కాంతులతో మెరిసిపోతుంది. నగరం అంతా లేజర్‌ లైట్లతో పాటుగా.. దీపాలను వెలిగించి పండుగ వాతావరణాన్ని తలపిస్తోంది.

 

Read More :

మహారాష్ట్రలో తగ్గిన కేసులు.. పెరిగిన రికవరీలు

కొత్త మ్యాప్ అంటూ మన ప్రదేశాలతో.. పాక్‌ కన్నింగ్ వేషాలు