Rocking Rio:18 రిపబ్లిక్ పరేడ్‌లు.. వయసు మాత్రం 22 సంవత్సరాలే.. వినడానికి విడ్డూరంగా ఉన్నా ఇది నిజమే..

|

Jan 26, 2021 | 5:07 AM

Rocking Rio: భారత గణతంత్ర దినోత్సవ కవాతుల్లో జైపూర్‌కు చెందిన 61 కావల్రీ రెజిమెంట్‌కు చెందిన రియోకు ప్రత్యేక స్థానం ఉంది. ఈ సారి జరుపుకునే

Rocking Rio:18 రిపబ్లిక్ పరేడ్‌లు.. వయసు మాత్రం 22 సంవత్సరాలే.. వినడానికి విడ్డూరంగా ఉన్నా ఇది నిజమే..
Follow us on

Rocking Rio: భారత గణతంత్ర దినోత్సవ కవాతుల్లో జైపూర్‌కు చెందిన 61 కావల్రీ రెజిమెంట్‌కు చెందిన రియోకు ప్రత్యేక స్థానం ఉంది. ఈ సారి జరుపుకునే పరేడ్‌లో పాల్గొనడంతో 18 సార్లు కవాతులో పాల్గొన్న ఏకైక అశ్వంగా గుర్తింపు సాధించింది. అయితే ఇప్పటికి రియో వయస్సు 22 సంవత్సరాలు మాత్రమే. మంగళవారం 72వ భారత్ గణతంత్ర వేడుకల్లో భాగంగా.. రియో ఈ విభాగాన్ని ముందుండి నడిపించనుంది. తన దళ కమాండర్‌ను సగర్వంగా వీపుపై ఎక్కించుకుని స్వారీ చేయనుంది.

హనోవేరియన్‌ జాతికి చెందిన ఈ గుర్రం భారత్‌లోనే పుట్టింది. తన నాలుగేళ్ల వయసు నుంచే రిపబ్లిక్‌ వేడుకల్లో పాల్గొంటోంది. కెప్టెన్‌ దీపాంశు షెరాన్‌ శిక్షణలో మరింత రాటుదేలిన రియో.. చాలా ప్రత్యేకమైన అశ్వం. ఇది తన పైఅధికారి మాటలను విని, చక్కగా అర్ధం చేసుకుంటుందట. ఇక రియోకు శిక్షణనిస్తున్న దీపాంశు షెరాన్‌ ఉత్తరాఖండ్‌లోని కాశీపుర్‌కు చెందిన వారు. ఈయన కుటుంబంలో నాలుగు తరాలుగా సైన్యంలో సేవలందిస్తున్నారట. సంప్రదాయ రీతిలో యూనిఫాం ధరించి పాల్గోనటమే ఓ గొప్ప గౌరవం కాగా.. అదీ రియోను అధిరోహించటం మరీ ప్రత్యేకమని చెబుతున్నారు.

పవన్ హస్తిన యాత్ర వెనుక అసలు రహస్యం ఇదేనా? బిజెపి పెద్దల ముందు జనసేనాని కొత్త ప్రతిపాదన..