Maharashtra Politics: మహారాష్ట్ర డిప్యూటీ స్పీకర్‌కు లేఖ రాసిన ఏక్‌నాథ్ షిండే.. లేఖలో ఏం కోరారంటే..!

| Edited By: Ravi Kiran

Jun 24, 2022 | 11:32 AM

Maharashtra - Eknath Shinde: శివసేన రెబల్ ఎమ్మెల్యే ఏక్‌నాథ్ షిండే మహారాష్ట్ర అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌కు లేఖ రాశారు. శివసేన లెజిస్లేచర్ పార్టీ..

Maharashtra Politics: మహారాష్ట్ర డిప్యూటీ స్పీకర్‌కు లేఖ రాసిన ఏక్‌నాథ్ షిండే.. లేఖలో ఏం కోరారంటే..!
Eknath Shinde
Follow us on

Maharashtra – Eknath Shinde: శివసేన రెబల్ ఎమ్మెల్యే ఏక్‌నాథ్ షిండే మహారాష్ట్ర అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌కు లేఖ రాశారు. శివసేన లెజిస్లేచర్ పార్టీ నాయకుడిగా తన నియామకాన్ని పునరుద్ఘాటించాలని కోరారు. అలాగే.. పార్టీ చీఫ్ విప్‌గా భరత్‌షేత్ గోగావాలేను నియమాకాన్ని గుర్తించాలని డిప్యూటీ స్పీకర్‌ను కోరారు. ఈ లేఖపై 37 మంది శివసేన ఎమ్మెల్యేలు సంతకాలు చేశారు. కాగా, ఈ లేఖ కాపీని డిప్యూటీ స్పీకర్ నరహరి జిర్వాల్, గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీ, శాసనమండలి కార్యదర్శి రాజేంద్ర భగవత్‌లకు పంపారు.

శివసేన పార్టీకి చెందిన దాదాపు 40 మంది ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేసిన విషయం తెలిసిందే. ఏక్‌నాథ్ షిండ్ నాయకత్వంలో.. ప్రత్యేక బృందంగా ఏర్పటయ్యారు. తమ అధినేత, సీఎం ఉద్ధవ్ ఠాక్రే తమను నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపిస్తూ తిరుగుబాటు చేసినట్లు రెబల్ ఎమ్మెల్యేలు ప్రకటించారు. అలాగే తమ తిరుగుబాటుకు కాంగ్రెస్, ఎన్సీపీలు కూడా కారణం అని ప్రకటిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏక్‌నాథ్ తాజా లేఖ చర్చనీయాంశంగా మారింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..