బెంగాల్ ప్రజల బాగు కోసం ప్రధాని మోదీ కాళ్లు పట్టుకోవడానికైనా సిద్ధం..కానీ… సీఎం మమతా బెనర్జీ ఆక్రోశం

| Edited By: Team Veegam

May 29, 2021 | 7:47 PM

యాస్ తుపాను నేపథ్యంలో సహాయక చర్యల సమీక్షకు గాను ప్రధాని మోదీ నిర్వహించిన సమావేశానికి తాను గైర్ హాజరు కావడం మీద రేగిన వివాదంపై బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ విరుచుకపడ్డారు.

బెంగాల్ ప్రజల బాగు కోసం ప్రధాని మోదీ కాళ్లు పట్టుకోవడానికైనా సిద్ధం..కానీ... సీఎం మమతా బెనర్జీ ఆక్రోశం
Follow us on

యాస్ తుపాను నేపథ్యంలో సహాయక చర్యల సమీక్షకు గాను ప్రధాని మోదీ నిర్వహించిన సమావేశానికి తాను గైర్ హాజరు కావడం మీద రేగిన వివాదంపై బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ విరుచుకపడ్డారు. మోదీ ప్రభుత్వం పైన, ప్రధాన మంత్రి కార్యాలయం పైన నిప్పులు చెరిగారు. ఇవి మీడియాలో తప్పుడు (ఫేక్), ఏకపక్ష సమాచారాన్ని సర్క్యులేట్ చేస్తున్నాయని, ట్వీట్లు చేస్తున్నాయని ఆమె ఆరోపించారు. రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించి తాను పాల్గొనాల్సిన సమావేశాలు చాలా ఉన్నాయని, అయినా ప్రధాని నుంచి అనుమతిని కూడా తీసుకున్నానని ఆమె చెప్పారు. కానీ ప్రధానమంత్రి కార్యాలయం తనను అవమానించే విధంగా ఏకపక్ష సమాచారాన్ని ఇస్తూ తన ప్రతిష్టను కించపరిచేలా వ్యవహరించిందన్నారు. దయచేసి నన్ను అవమానించకండి.. వేధించకండి అని ఆమె వర్చ్యువల్ గా జరిగిన ప్రెస్ మీట్ లో కేంద్రాన్ని కోరారు. రాష్ట్ర ప్రయోజనాలు తనకు ముఖ్యమని, వీటికి ప్రమాదం రానివ్వబోమని చెప్పిన ఆమె.. ఈ రాష్ట్ర బాగు కోసం తన కాళ్ళు పట్టుకోవాలని ప్రధాని కోరినా అందుకు సిద్ధంగా ఉన్నానని ఆవేశంగా వ్యాఖ్యానించారు. కానీ నన్ను అవమానపరచకండి అని కోరారు. తనకు, మోదీకి మధ్య సమావేశాన్ని ఏర్పాటు చేసినప్పుడు బీజేపీ నేతలు, గవర్నర్ మధ్యలో ఎందుకు రావాలని మమతా బెనర్జీ ప్రశ్నించారు. అసలు వీళ్ళు ఈ మీటింగ్ లో పాల్గొనాల్సిన అవసరం ఏమిటన్నారు. కాన్ఫరెన్స్ రూమ్ లో ఖాళీ కుర్చీలు చాలా కనిపించాయని చెప్పిన ఈమె.. వీరి జోక్యంలో ఔచిత్యం ఉందా అని కూడా అన్నారు.

బెంగాల్ ఎన్నికల్లో మా తృణమూల్ కాంగ్రెస్ ఘన విజయం సాధించి బీజేపీ ఓడిపోవడంతో ప్రధాని, ఆ పార్టీ నేతలు రాజకీయ కక్షతో వ్యవహరిస్తున్నారని మమత ఆరోపించారు.

మరిన్ని వీడియోలు చుడండి ఇక్కడ : బయటికి ఎందుకొచ్చావ్ అని అడిగితే..! ఇతని తలతిక్క సమాధానం చూడండి.నవ్వు ఆపుకోలేరు :Varal Video.

ఏనుగును చూసి పరిగెత్తిన పులి..!పులా..?ఏనుగా..?దియా మీడియాతో ఫుల్ కన్ఫ్యూజన్ : Viral Video.

ఈ డాక్టర్ల పై ప్రశంసల వెల్లువ ఇంతకి వారేం చేసారో తెలుసా..?గిరిజనుల కోసం నదులుదాటి వినూత్న సాహసం వీడియో..

మళ్లీ అజ్ఞాతంలోకి ఆనందయ్య..కృష్ణపట్నంలోని తన ఇంటి నుండి మాయం.లైవ్ వీడియో.:Anandayya Medicine Live Video.

నాకే వెయ్యి