రజనీకాంత్ పొలిటికల్ యాక్షన్‌కు ముహూర్తం ఖరారు.. ఎప్పుడంటే ?

| Edited By: Srinu

Nov 18, 2019 | 3:20 PM

ఇండియన్ సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయాల్లోకి రావడం కన్‌ఫర్మ్ అయినా.. ఎప్పట్నించి పొలిటికల్ యాక్షన్‌ షురువవుతుందన్నది ఆయన అభిమానులకు అంతుచిక్కని పరిస్థితి. తాజా పరిణామాల్లో ఆయన ఎప్పట్నించి రాజకీయాల్లో యాక్టివ్ అవుతారన్నది క్లారిటీ వచ్చింది. దీనికి ఆయన ఇటీవల తీసుకున్న నిర్ణయాలు కూడా బలం చేకూరుస్తున్నాయి. ఆల్ మోస్ట్ రెండేళ్ళ క్రితం అంటే జనవరి, 2018లో రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తున్నానన్న కబురు తన అభిమానులకు అందించాడు. సుమారు వారం రోజుల పాటు చెన్నై కోడంబాకంలోని తన సొంతమైన […]

రజనీకాంత్ పొలిటికల్ యాక్షన్‌కు ముహూర్తం ఖరారు.. ఎప్పుడంటే ?
Follow us on

ఇండియన్ సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయాల్లోకి రావడం కన్‌ఫర్మ్ అయినా.. ఎప్పట్నించి పొలిటికల్ యాక్షన్‌ షురువవుతుందన్నది ఆయన అభిమానులకు అంతుచిక్కని పరిస్థితి. తాజా పరిణామాల్లో ఆయన ఎప్పట్నించి రాజకీయాల్లో యాక్టివ్ అవుతారన్నది క్లారిటీ వచ్చింది. దీనికి ఆయన ఇటీవల తీసుకున్న నిర్ణయాలు కూడా బలం చేకూరుస్తున్నాయి.

ఆల్ మోస్ట్ రెండేళ్ళ క్రితం అంటే జనవరి, 2018లో రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తున్నానన్న కబురు తన అభిమానులకు అందించాడు. సుమారు వారం రోజుల పాటు చెన్నై కోడంబాకంలోని తన సొంతమైన రాఘవేంద్ర కల్యాణ మండపంలో తన అభిమానులతో వరుసగా భేటీలు నిర్వహించిన రజనీకాంత్.. చివరికి తాను రాజకీయాల్లోకి వస్తున్నానన్న కబురు వెల్లడించారు. అయితే.. ఆ తర్వాత ఆయన రాజకీయ ప్రస్థానం మాత్రం వేగంగా ఏమీ కొనసాగలేదు. తాను అప్పటికే కమిట్ అయి వున్న సినిమాలతోపాటు మరి కొన్ని సినిమాల్లో ఆయన నటిస్తూ.. రాజకీయాల్లో అడపాదడపా కొన్ని స్టేట్ మెంట్లకే పరిమితమయ్యారు.

అయితే.. తమిళనాడులో ఇప్పట్లో అసెంబ్లీ ఎన్నికలు లేకపోవడమే రజనీకాంత్ నెమ్మదికి కారణమని అందరు భావించారు. అయితే.. ఈ మధ్యకాలంలో వచ్చిన సార్వత్రిక ఎన్నికలకు ఆయన దూరంగానే వున్నారు. దానికి కారణం పార్టీ స్వరూపం పూర్తిగా ఏర్పడకపోవడమే అనుకున్నారందరు. కొన్ని అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు వచ్చినా.. ఆయన పోటీకి విముఖత చూపారు. ఎన్నికల్లో పోటీకి దూరంగా వున్నారు సరే.. మరి పార్టీ స్వరూపాన్నైనా నిర్మించారా అంటే అదీ జరగలేదు. దాంతో అసలు రజనీకాంత్ మనస్సులో ఏముంది ? పోటీకి జంకుతున్నారా ? అన్న సందేహాలు ఆయన అభిమానులతోపాటు రాజకీయ విశ్లేషకుల్లో కలగడం మొదలైంది.

అయితే.. తాజాగా రజనీకాంత్ కదలికలు.. ఆయన సన్నిహితులు, ఫ్యాన్స్ చెబుతున్న మాటల ప్రకారం వచ్చే సెప్టెంబర్ (2020)లో రజనీకాంత్ రాజకీయాల్లో సమర శంఖం పూరించబోతున్నారు. 2016 మే 16న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరిగి జయలలిత సారథ్యంలో ప్రభుత్వం ఏర్పడింది. ఆ తర్వాత ఆమె మరణించగా.. ముఖ్యమంత్రి బాధ్యతలను పళనిస్వామి చేపట్టారు. 2021 మే నెలలోగా తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. సో.. దానికి కనీసం 6-8 నెలల ముందుగా పార్టీ స్వరూపాన్ని ఖరారు చేసుకునేందుకు రజనీకాంత్ సిద్దమవుతున్నట్లు విశ్వసనీయ సమాచారం.

ఈలోగా తనకు తమిళనాడు వ్యాప్తంగా వున్న ఫ్యాన్స్ క్లబ్స్‌ని పార్టీ కింది స్థాయి కమిటీలుగా మార్చాలని రజనీకాంత్ భావిస్తున్నారు. ఫ్యాన్స్ క్లబ్బులను కమిటీలుగా మార్చిన తర్వాత జిల్లా, రాష్ట్ర స్థాయి కమిటీల ఏర్పాటు సులభతరమవుతుందని, ఈలోగా తనతో కలిసి వచ్చే రాజకీయ నాయకులు, మేధావులకు పార్టీ థింక్ ట్యాంక్‌లో భాగస్వామ్యం కల్పించాలని రజనీకాంత్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

సెప్టెంబర్‌లో పార్టీ కమిటీలను ప్రకటించి.. ఆ వెంటనే రాష్ట్ర వ్యాప్త పర్యటనకు రజనీకాంత్ సిద్దమవుతున్నట్లు చెబుతున్నారు ఆయన ఫ్యాన్స్. ఆరు నెలల కాలంలో రాష్ట్రంలోని 232 అసెంబ్లీ నియోజకవర్గాలలో పర్యటించాలన్నది రజనీకాంత్ అభిమతమని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. రాష్ట్రంలోని నలుమూలల విస్తృతంగా పర్యటించడం ద్వారా అసెంబ్లీ ఎన్నికల్లో తన సత్తా ఏంటో చూపాలన్నది తలైవా స్ట్రాటెజీ అని తెలుస్తోంది. సో.. లెటజ్ విష్ రజనీకాంత్ .. ఆల్ ద బెస్ట్..