Viral: ట్రైన్‌లో సీటు కింద అనుమానాస్పదంగా బ్యాగ్.. లోపల దుస్తుల మధ్య ఓ సబ్బు పెట్టె.. దాన్ని ఓపెన్ చేయగా షాక్

|

Jul 31, 2022 | 3:05 PM

కేటుగాళ్లు రూట్ మారుస్తున్నారు. అక్రమ కార్యకలాపాలకు రైళ్లను అడ్డాగా చేసుకుంటున్నారు. పోలీసులకు చిక్కకుండా ఇస్మార్ట్ ఐఢియాలతో దూసుకుపోతున్నారు.

Viral: ట్రైన్‌లో సీటు కింద అనుమానాస్పదంగా బ్యాగ్.. లోపల దుస్తుల మధ్య ఓ సబ్బు పెట్టె.. దాన్ని ఓపెన్ చేయగా షాక్
representative image
Follow us on

Kerala News: కేటుగాళ్లు అస్సలు వెనక్కి తగ్గడం లేదు. పుష్ప మాదిరి స్కెచ్చులతో అల్లాడిస్తున్నారు. మత్తు పదార్థాలను రవాణా చేయడానికి రోజురోజుకు అప్‌డేట్ అవుతున్నారు. రోడ్డు మార్గంలో చెకింగ్స్ గట్టిగా ఉండటంతో.. రైలు మార్గంపై ఫోకస్ పెట్టారు. అయితే RPF కూడా అక్రమార్కులకు చెక్ పెట్టేందుకు స్పెషల్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ రెడీ చేసింది. గంజాయి సహా ఇతర మత్తు పదార్థాలను గుర్తించేందుకు డాగ్ స్క్వాడ్‌కు స్పెషల్ ట్రైనింగ్ ఇచ్చింది. ఈ క్రమంలోనే ఈ మత్తు దందాలకు పాల్పడే వ్యక్తులు ఈ మధ్య ట్రైన్లలో కూడా చిక్కుతున్నారు. కొందరు అయితే తనిఖీలకు భయపడి.. రైళ్లలో ఆ గలీజ్ పదార్థాలు వదిలేసి ఎస్కేప్ అవుతున్నారు. ఈ క్రమంలోనే పాలక్కాడ్(Palakkad) ఒలవకోడ్ స్టేషన్‌(Olavakkode Railway station)లో పాట్నా-ఎరనాకులం రైలులో రద్దీగా ఉండే జనరల్ కంపార్ట్‌మెంట్‌లో RPF క్రైమ్ ఇంటెలిజెన్స్ విభాగం తనిఖీలు చేసింది.  ఓ భోగిలోని సీటు కింద ఓ అనుమానాస్పద బ్యాగ్‌ను గుర్తించింది. ఆ బ్యాగ్ ఎవరిది అని ఎన్నిసార్లు అడిగినా ఎవరూ ముందుకు రాలేదు. దీంతో RPF టీమ్ ఆ బ్యాగును తెరిచింది. లోపల కొన్ని బట్టలు కనిపించాయి. వాటిని బయటకు తీయగా దుస్తుల మధ్యలో దాచి ఉంచిన నాలుగు కేజీల గంజాయి బటయపడింది. లోపల డబ్బు పెట్టె, బ్రష్ కూడా ఉన్నాయి. వాటిని పెద్దగా పట్టించుకోలేదు అధికారులు. కానీ ఎందుకైనా మంచిదని సోప్  బాక్స్ ఓపెన్ చేయగా కళ్లు చెదిరిపోయాయి. లోపల 20 గ్రాముల హెరాయిన్ ఉంది. దాన్ని ప్లాస్టిక్ కవర్‌లో చుట్టి సబమ్బులాగా పెట్టె లోపల దాచారు. రైలులో తనిఖీలను గమనించిన స్మగ్లర్ పారిపోయినట్లు RPF క్రైమ్ ఇంటెలిజెన్స్ విభాగం  నిర్ధారించింది. సీసీటీవీ ఫుటేజీని పరిశీలించి డ్రగ్ స్మగ్లర్‌ను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. పట్టుబడిన హెరాయిన్ విలువ మార్కెట్ లో రూ.8 లక్షలకు పైనే ఉంటుందని అధికారులు తెలిపారు. రైల్లో ఇంత పెద్ద మొత్తంలో హెరాయిన్‌ను స్వాధీనం చేసుకోవడం ఇదే తొలిసారి అని వెల్లడించారు.

Drugs

మరిన్ని జాతీయ వార్తల కోసం..