మళ్లీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీయేనా? అసమ్మతి నేతలతో చర్చలు జరుపుతున్న..

|

Dec 20, 2020 | 5:49 AM

కాంగ్రెస్ పార్టీలో ప్రక్షాళన కోరుతూ అసమ్మతి గళం వినిపించిన నేతలతో కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ చర్చలు జరుపుతున్న

మళ్లీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీయేనా? అసమ్మతి నేతలతో చర్చలు జరుపుతున్న..
Follow us on

కాంగ్రెస్ పార్టీలో ప్రక్షాళన కోరుతూ అసమ్మతి గళం వినిపించిన నేతలతో కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ చర్చలు జరుపుతున్న సంగతి తెలిసిందే. కొత్త సంవత్సరంలో పార్టీ కొత్త అధ్యక్షుడిగా రాహుల్ గాంధీనే నియమిస్తారని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే సుధీర్ఘకాలంగా నాయకత్వ లోపంతో బాధపడతున్న జాతీయ కాంగ్రెస్ పార్టీకి మిగిలిన ఏకైక కిరణం రాహుల్ గాంధీ మాత్రమే.

సార్వత్రిక ఎన్నికల ఓటమి అనంతరం రాహుల్ పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి సోనియాగాంధీయే తాత్కాలిక అధ్యక్షురాలిగా కొనసాగుతున్నారు. సంవత్సరం గడుస్తున్నా ఆ పదవిపై అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడం ఇప్పుడు హాట్‌ టాఫిక్‌గా మారింది. తాజాగా సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ కాంగ్రెస్ సీనియర్ నేతలతో చర్చలు జరిపారు. ఈ చర్చల్లో రాహుల్ గాంధీ మాట్లాడిన మాటలు ప్రాధన్యతను సంతరించుకున్నాయి. అందరు ఒప్పుకుంటే పార్టీ కోసం పనిచేయడానికి తాను ఎల్లప్పుడు సిద్దమేనని అన్నారు. దీంతో ఎవరూ ఆయన మాటలను వ్యతిరేకించలేదు. అయితే మళ్లీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీ కొనసాగుతారని వార్తలు మాత్రం వినిపిస్తున్నాయి. దీనిపై అధికారిక ప్రకటన మాత్రం ఇంకా వెలువడలేదు.