3 నిమిషాలే టైమ్.. తండ్రికి కరోనా అనుమానితురాలి వీడ్కోలు.. కన్నీళ్లు పెట్టిస్తోన్న ఘటన

| Edited By:

Jun 05, 2020 | 2:46 PM

దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతూ మరణించిన తండ్రికి అంతిమ వీడ్కోలు కోసం ఓ కరోనా అనుమానితురాలికి కేవలం 3 నిమిషాల సమయం మాత్రమే ఇచ్చారు.

3 నిమిషాలే టైమ్.. తండ్రికి కరోనా అనుమానితురాలి వీడ్కోలు.. కన్నీళ్లు పెట్టిస్తోన్న ఘటన
Follow us on

దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతూ మరణించిన తండ్రికి అంతిమ వీడ్కోలు కోసం ఓ కరోనా అనుమానితురాలికి కేవలం 3 నిమిషాల సమయం మాత్రమే ఇచ్చారు. ఓ అంబులెన్స్‌లో ఆమెను ఇంటివరకు తీసుకొచ్చిన వైద్యులు.. స్టాప్‌వాచ్‌ల్లో సమయం పెట్టుకొని మరీ ఆ యువతిని అక్కడి నుంచి తీసుకెళ్లారు. మనసుల్ని మెలిపెడుతోన్న ఈ ఘటన మణిపూర్‌లో జరిగింది.

మణిపూర్‌లోని కాంగ్‌పోక్పికి చెందిన అంజలి హమంగ్తే(22) అనే యువతి గత నెల 25న శ్రామిక్ రైల్‌లో చెన్నై నుంచి ఆ రాష్ట్రానికి చేరుకుంది. అయితే ఆమెతో ప్రయానించిన మరొకరికి కరోనా పాజిటివ్‌గా తేలడంతో అంజలిని కూడా క్వారంటైన్ సెంటర్‌కి తరలించారు. మరోవైపు ఆమె తండ్రి ఇటీవల మరణించారు. దీంతో తన తండ్రికి అంతిమ వీడ్కోలు పలికేందుకు తనకు అనుమతి ఇవ్వాలంటూ ఆమె అధికారులకు విఙ్ఞప్తి చేశారు. ఆ విఙ్ఞప్తిపై సానుకూలంగా స్పందించిన అధికారులు.. ఆమెకు పీపీఈ కిట్ వేయించి, ప్రత్యేక అంబులెన్స్‌లో గురువారం ఇంటికి తీసుకెళ్లారు. అక్కడ ఉండటానికి ఆమెకు 3 నిమిషాలు మాత్రమే సమయం ఇచ్చారు. మూడు నిమిషాలు గడుస్తూనే అంజలిని అక్కడి నుంచి క్వారంటైన్ సెంటర్‌కి తరలించారు. ఆ సమయంలో అంజలి దగ్గరకు కుటుంబసభ్యులను కూడా రానివ్వలేదు. కాగా మణిపూర్‌లో నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 121కు చేరింది.

Read This Story Also: కరోనా అలర్ట్: హైదరాబాద్‌లోని 159 ప్రాంతాల్లో కొత్త కంటైన్మెంట్ జోన్లు ఇవే..