Punjab New CM: పంజాబ్‌లో ఉత్కంఠకు తెర.. కొత్త సీఎంగా సుఖ్‌జిందర్‌ రణదావాను ఎంపిక.. కాంగ్రెస్ అధిష్టానం కీలక నిర్ణయం..

|

Sep 19, 2021 | 3:22 PM

Punjab New CM Sukhjinder Randhawa: పంజాబ్‌లో ఉత్కంఠకు తెరపడింది. పంజాబ్‌ కొత్త సీఎంగా సుఖ్‌జిందర్‌ రణదావాను ఎంపిక చేసింది కాంగ్రెస్‌ అధిష్టానం. కెప్టెన్‌ అమరీందర్‌సింగ్‌ స్థానంలో సుఖ్‌జిందర్‌ను...

Punjab New CM: పంజాబ్‌లో ఉత్కంఠకు తెర.. కొత్త సీఎంగా సుఖ్‌జిందర్‌ రణదావాను ఎంపిక.. కాంగ్రెస్ అధిష్టానం కీలక నిర్ణయం..
Punjab Congress Nominates S
Follow us on

పంజాబ్‌లో ఉత్కంఠకు తెరపడింది. పంజాబ్‌ కొత్త సీఎంగా సుఖ్‌జిందర్‌ రణదావాను ఎంపిక చేసింది కాంగ్రెస్‌ అధిష్టానం. కెప్టెన్‌ అమరీందర్‌సింగ్‌ స్థానంలో సుఖ్‌జిందర్‌ను ఎన్నుకున్నారు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు. అమరీందర్‌ మంత్రివర్గంలో మంత్రిగా పనిచేసిన అనుభవం సుఖ్‌జిందర్‌కు ఉంది. కాంగ్రెస్‌కు వీరవిధేయుడిగా సుఖ్‌జిందర్‌ రణదావాకు పేరు ఉంది. అధిష్టానం దూతలు ఎమ్మెల్యేలతో సమావేశమైన తరువాత ఆయన పేరును ప్రతిపాదించారు.

అయితే.. పంజాబ్‌ సీఎం రేసులో పలువురి పేర్లు వినిపించాయి. పీసీసీ చీఫ్‌ సిద్ధూతో పాటు మాజీ పీసీసీ చీఫ్‌ సునీల్‌ జాఖడ్‌, మాజీ సీఎం రాజేందర్‌ కౌర్‌ భట్టల్‌, ప్రతాప్‌ సింగ్‌ భజ్వా, రణ్వీత్‌ బిట్టు, మంత్రి సుఖ్జీందర్‌ సింగ్‌ రంధావా పేర్లు వినిపిస్తున్నాయి. అయితే సీనియర్‌ నేత అంబికా సోనీ పేరు తెరపైకొచ్చినా.. తాను సీఎం రేసులో లేనని ప్రకటించారామె.

మరోవైపు మాజీ ముఖ్యమంత్రి అమరీందర్‌ సింగ్‌.. సిద్ధూను తీవ్రంగా వ్యతిరేకించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ సీఎంగా సిద్ధూను అంగీకరించేది లేదని తేల్చి చెప్పారు. దీంతో పార్టీకి చాలా వీరవిదేయుడిగా పేరున్న సుఖ్‌జిందర్‌‌ను ఎంపిక చేసుకున్నారు.

సీఎం పదవికి కెప్టెన్ అమరీందర్ సింగ్ రాజీనామా చేయడంతో పంజాబ్ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. పంబాజ్ తదుపరి సీఎం ఎవరన్న సస్పెన్స్ కొనసాగించింది కాంగ్రెస్ పార్టీ అధిష్టానం.

అయితే.. సీఎంగా పీసీసీ చీఫ్ సిద్ధూను అంగీకరించేది లేదని అమరీందర్ సింగ్ ఇప్పటికే తేల్చిచెప్పారు. సిద్ధూకు పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌తో సన్నిహిత సంబంధాలున్నాయని.. ఆయన సీఎం కావడం దేశ భద్రతకు విఘాతమని శనివారంనాడు తీవ్ర ఆరోపణలు చేశారు.

ఇవి కూడా చదవండి: Kalonji Farming: కలోంజి సాగుతో ఏడాదికి లక్షల రూపాయలు సంపాదన.. ఇది ఎలా సాగు చేయాలో తెలుసుకోండి..

ఏపీ పరిషత్ ఫైట్ 

ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

బాలాపూర్ గణేష్ నిమజ్జనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

 

పంజాబ్ గవర్నర్ నివాసానికి వెళ్లిన ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్. .  గవర్నర్ బన్వారీలాల్ పురోహిత్ ను కలిసి తన రాజీనామా లేఖను సమర్పించారు. పీసీసీ అధ్యక్షుడు, మాజీ క్రికెటర్ నవజోత్ సింగ్ సిద్ధూతో నెలకొన్న ఆధిపత్య పోరు చివరికి సాక్షాత్తూ ముఖ్యమంత్రి పదవికే రాజీనామా చేసే పరిస్థితి దాపురించింది. కాంగ్రెస్ అధినేత్రి ఆదేశాల మేరకు అమరీందర్ సింగ్ తన పదవికి రాజీనామా చేసినట్టు సమాచారం. ఈ సాయంత్రం ఐదు గంటలకు పీసీసీ అధ్యక్షుడు నవజోత్ సింగ్ సిద్ధూ నేతృత్వంలో కాంగ్రెస్ శాసనసభా పక్ష సమావేశం జరుగుతోన్న నేపథ్యంలో అమరీందర్ రాజీనామా చేయడం విశేషం.