Puducherry: ఇది పుదుచ్చేరి ప్రజల విజయం.. కిరణ్ బేడీ తొలగింపుపై సీఎం నారాయణస్వామి

|

Feb 17, 2021 | 3:19 AM

CM Narayanasamy: పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్‌గా కిరణ్ బేడిని తొలగించడంపై ముఖ్యమంత్రి వి.నారాయణస్వామి హర్షం వ్యక్తంచేశారు. ఇది పుదుచ్చేరి ప్రజల విజయమని..

Puducherry: ఇది పుదుచ్చేరి ప్రజల విజయం.. కిరణ్ బేడీ తొలగింపుపై సీఎం నారాయణస్వామి
Follow us on

CM Narayanasamy: పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్‌గా కిరణ్ బేడిని తొలగించడంపై ముఖ్యమంత్రి వి.నారాయణస్వామి హర్షం వ్యక్తంచేశారు. ఇది పుదుచ్చేరి ప్రజల విజయమని ఆయన అభిప్రాయపడ్డారు. పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ పదవి నుంచి కిరణ్ బేడిని తొలగిస్తూ మంగళవారం రాత్రి రాష్ట్రపతి భవన్ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతోపాటు తెలంగాణ గవర్నర్‌ తమిళసైకి పుదుచ్చేరి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కిరణ్ బేడీని తొలగించిన అనంతరం సీఎం నారయణస్వామి మీడియాతో మాట్లాడారు. తమ ఒత్తిడి కారణంగానే కేంద్ర ప్రభుత్వం కిరణ్ బేడిని తొలగించిందని.. ఇది పుదుచ్చేరి ప్రజల విజయమని నారయణ స్వామి పేర్కొన్నారు. కిరణ్ బేడీ సంక్షేమ పథకాలను అడ్డుకున్నారని.. దీంతో ఇక్కడ అభివృద్ధికి ఆటంకం కలిగిందని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర వ్యవహారాల్లో ఎల్జీ జోక్యం ఎక్కువ అయిందంటూ మండిపడ్డారు.

గత కొద్దికాలం నుంచి సీఎం నారాయణస్వామితో కిరణ్‌బేడీకి ఆధిపత్య పోరు నడుస్తోంది. ఈ క్రమంలో ఇటీవల సీఎం నారయణస్వామి తమ ప్రభుత్వ వ్యవహారాల్లో ఎల్జీ జోక్యం చేసుకుంటూ.. అభివృద్ధికి ఆటంకం కలిగిస్తున్నారని.. ఆమెను తొలగించాలంటూ.. రాష్ట్రపతిని కలిసి ఫిర్యాదు చేశారు. ఇదిలాఉంటే.. అసెంబ్లీ ఎన్నికలకు ముందు పలువురు కాంగ్రెస్ శాసనసభ్యులు రాజీనామా చేయడంతో పుదుచ్చేరి ప్రభుత్వం మైనారిటీలో పడింది. ఇప్పటివరకు నలుగురు ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. అయితే తమ ప్రభుత్వానికి ఎలాంటి ప్రమాదం లేదంటూ సీఎం నారాయణ స్వామి పేర్కొన్నారు.

Also Read:

పుదుచ్చేరి లెప్టినెంట్‌ గవర్నర్‌ కిరణ్‌బేడీ తొలగింపు.. తమిళసైకి అదనపు బాధ్యతలు అప్పగించిన కేంద్రం

Smriti Irani: దేశీ భావాలనే గౌరవించండి.. షెహనాజ్ గిల్ వైరల్ వీడియోను షేర్ చేసిన కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ..