PM Modi: ప్రధాని మోడీని కదిలించిన విగ్రహం.. పౌరుల కనీస బాధ్యతను తెలియజేస్తోందని ట్వీట్..

|

Oct 04, 2022 | 1:53 PM

పర్యావరణ పరిరక్షణకు సంబంధించి సౌత్‌ వెస్ట్రన్‌ రైల్వే బెంగళూరు రైల్వే స్టేషన్‌లో అధికారులు ఓ వినూత్న ప్రయత్నం చేశారు. అది ప్రయాణికులను ఎంతగానో ఆకర్షించింది. అంతే కాకుండా ఆలోచింపచేస్తుంది. ప్లాస్టిక్ ఖాళీ వాటర్...

PM Modi: ప్రధాని మోడీని కదిలించిన విగ్రహం.. పౌరుల కనీస బాధ్యతను తెలియజేస్తోందని ట్వీట్..
Pm Modi
Follow us on

పర్యావరణ పరిరక్షణకు సంబంధించి సౌత్‌ వెస్ట్రన్‌ రైల్వే బెంగళూరు రైల్వే స్టేషన్‌లో అధికారులు ఓ వినూత్న ప్రయత్నం చేశారు. అది ప్రయాణికులను ఎంతగానో ఆకర్షించింది. అంతే కాకుండా ఆలోచింపచేస్తుంది. ప్లాస్టిక్ ఖాళీ వాటర్ బాటిళ్లతో భూమాత విగ్రహాన్ని తయారు చేశారు. ఆ విగ్రహంపై ‘నన్ను కాపాడండి’ అని రాశారు. ప్రజల్లో పర్యావరణం పట్ల అవగాహన కల్పించేందుకు సౌత్ వెస్టర్న్ రైల్వే దీన్ని ఏర్పాటు చేసింది. ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ ఒక పెద్ద సవాలుగా మారిన తరుణంలో ఈ విగ్రహం అందరినీ ఆలోచింపచేస్తోంది. ముఖ్యంగా బస్ స్టేషన్లు, రైల్వే స్టేషన్లలో ప్లాస్టిక్ వ్యర్థాలు మరీ ఎక్కువగా కనిపిస్తుంటాయి. ఈ వ్యర్థాలను తగ్గించేందుకు, ప్రజల్లో అవగాహన కోసం సౌత్ వెస్టర్న్ రైల్వే బెంగళూరులోని పలు రైల్వే స్టేషన్లలో ప్రత్యేక చర్యలు చేపట్టింది.

క్రాంతి వీర సంగోలి రాయన్న (కేఎస్ఆర్) రైల్వే స్టేషన్ సిబ్బంది ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించారు. రైల్వే స్టేషన్ పరిసరాల్లో పడేసిన ప్లాస్టిక్ బాటిళ్లను సేకరించి విగ్రహంగా తయారు చేశారు. ఈ ప్రయత్నం ప్రధాని మోడీని సైతం కదిలించింది. ‘‘ఈ తరహా ప్రయత్నాలు వినూత్నమైనవే కాదు. ప్రశంసనీయమైనవి. మన పరిసరాలు, బహిరంగ ప్రదేశాలను శుభ్రంగా ఉంచుకోవాల్సిన పౌరుల కనీస బాధ్యతను గుర్తు చేస్తోంది’’అంటూ ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.

ఇవి కూడా చదవండి

కాగా.. దేశంలోని అన్ని నగరాలను వెనక్కి నెట్టి ఇండోర్ మరోసారి పరిశుభ్రతలో నంబర్ వన్ గా నిలిచింది. ఆరోసారి ఈ రికార్డు సాధించింది. నగర పరిశుభ్రత ర్యాంకింగ్ పట్ల నగర వాసులు సంతోషం వ్యక్తం చేశారు. స్వచ్ఛత ర్యాంకింగ్‌లో ప్రథమ స్థానంలో నిలిచిన నగరవాసులకు లడ్డూ పంపిణీ చేశారు. ఇండోర్ పరిశుభ్రతలో విషయంలో నంబర్ వన్ గా నిలవడానికి కారణం నిరంతరం శ్రమ పడుతున్న పారిశుధ్య కార్మికులేనని అన్నారు. రాబోయే రోజుల్లో ఇండోర్ మునిసిపల్ కార్పొరేషన్ ప్లాస్టిక్ నిషేధంపై ప్రచారాన్ని ప్రారంభించనున్నామని తెలిపింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్  చేయండి..