నూతన చట్టాల ఆవశ్యకతను తెలిపే ప్రయత్నం చేస్తున్న ప్రధాని మోదీ.. సంస్కరణల తర్వాత రైతులకు..

| Edited By: Pardhasaradhi Peri

Dec 12, 2020 | 1:11 PM

రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని ఢిల్లీ సరిహద్దుల్లో 17 రోజులుగా చేస్తున్న అన్నదాతల ఆందోళనలు తీవ్రతరం అయ్యాయి.

నూతన చట్టాల ఆవశ్యకతను తెలిపే ప్రయత్నం చేస్తున్న ప్రధాని మోదీ..  సంస్కరణల తర్వాత రైతులకు..
Follow us on

రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని ఢిల్లీ సరిహద్దుల్లో 17 రోజులుగా చేస్తున్న అన్నదాతల ఆందోళనలు తీవ్రతరం అయ్యాయి. రైతుల మద్దతుకు దేశంలోని రాజకీయ పార్టీలే కాకుండా విదేశీయులు కూడా మద్దతు తెలుపుతున్నారు. మరోవైపు రైతు సంఘాల నాయకులతో చర్చలు విఫలం కావడంతో తాడోపేడో తేల్చుకోవడానికి మోదీ సర్కార్ సిద్ధమవుతోంది.

అయితే నూతనంగా వచ్చిన రైతు చట్టాల గురించి అన్నదాతలకు వివరించే ప్రయత్నం చేశారు ప్రధాని నరేంద్రమోదీ. వాటిని తీసుకురావడానికి గల ఆవశ్యకతను, వాటి వల్ల కలిగే లాభాలను తెలియజేస్తున్నారు. వ్యవసాయ రంగంలో మౌలిక సదుపాయాలు, ఆహార ప్రాసెసింగ్, వ్యవసాయ ఉత్పత్తుల నిల్వలలో అడ్డంకులను తాము చూశామన్నారు. వ్యవసాయ రంగం మరియు దానితో సంబంధం ఉన్న ఇతర రంగాల్లో ఇబ్బందులను గమనించి ఈ నూతన చట్టాల రూపకల్పన చేశామని ఒక ప్రకటనలో తెలిపారు. దీని వల్ల ఇప్పుడు అన్ని అడ్డుగోడలు, అడ్డంకులు తొలగిపోతున్నాయన్నారు. నూతన సంస్కరణల తరువాత రైతులకు కొత్త మార్కెట్లు, మార్కెట్ల ఎంపిక, సాంకేతిక పరిజ్ఞానం ద్వారా మరింత ప్రయోజనం లభిస్తుందని వెల్లడించారు. కోల్డ్ స్టోరేజ్‌లకు సంబంధించిన మౌలిక సదుపాయాలు ఆధునీకరించబడతాయని అన్నారు. దీనివల్ల వ్యవసాయ రంగంలో ఎక్కువ పెట్టుబడులు వస్తాయి రైతులకు ఎక్కువ ప్రయోజనం చేకూరుతుందని వివరించారు.