నూతన చట్టాల ఆవశ్యకతను తెలిపే ప్రయత్నం చేస్తున్న ప్రధాని మోదీ.. సంస్కరణల తర్వాత రైతులకు..

రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని ఢిల్లీ సరిహద్దుల్లో 17 రోజులుగా చేస్తున్న అన్నదాతల ఆందోళనలు తీవ్రతరం అయ్యాయి.

నూతన చట్టాల ఆవశ్యకతను తెలిపే ప్రయత్నం చేస్తున్న ప్రధాని మోదీ..  సంస్కరణల తర్వాత రైతులకు..
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Dec 12, 2020 | 1:11 PM

రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని ఢిల్లీ సరిహద్దుల్లో 17 రోజులుగా చేస్తున్న అన్నదాతల ఆందోళనలు తీవ్రతరం అయ్యాయి. రైతుల మద్దతుకు దేశంలోని రాజకీయ పార్టీలే కాకుండా విదేశీయులు కూడా మద్దతు తెలుపుతున్నారు. మరోవైపు రైతు సంఘాల నాయకులతో చర్చలు విఫలం కావడంతో తాడోపేడో తేల్చుకోవడానికి మోదీ సర్కార్ సిద్ధమవుతోంది.

అయితే నూతనంగా వచ్చిన రైతు చట్టాల గురించి అన్నదాతలకు వివరించే ప్రయత్నం చేశారు ప్రధాని నరేంద్రమోదీ. వాటిని తీసుకురావడానికి గల ఆవశ్యకతను, వాటి వల్ల కలిగే లాభాలను తెలియజేస్తున్నారు. వ్యవసాయ రంగంలో మౌలిక సదుపాయాలు, ఆహార ప్రాసెసింగ్, వ్యవసాయ ఉత్పత్తుల నిల్వలలో అడ్డంకులను తాము చూశామన్నారు. వ్యవసాయ రంగం మరియు దానితో సంబంధం ఉన్న ఇతర రంగాల్లో ఇబ్బందులను గమనించి ఈ నూతన చట్టాల రూపకల్పన చేశామని ఒక ప్రకటనలో తెలిపారు. దీని వల్ల ఇప్పుడు అన్ని అడ్డుగోడలు, అడ్డంకులు తొలగిపోతున్నాయన్నారు. నూతన సంస్కరణల తరువాత రైతులకు కొత్త మార్కెట్లు, మార్కెట్ల ఎంపిక, సాంకేతిక పరిజ్ఞానం ద్వారా మరింత ప్రయోజనం లభిస్తుందని వెల్లడించారు. కోల్డ్ స్టోరేజ్‌లకు సంబంధించిన మౌలిక సదుపాయాలు ఆధునీకరించబడతాయని అన్నారు. దీనివల్ల వ్యవసాయ రంగంలో ఎక్కువ పెట్టుబడులు వస్తాయి రైతులకు ఎక్కువ ప్రయోజనం చేకూరుతుందని వివరించారు.

Latest Articles
ప్రసన్న వదనం మూవీ రివ్యూ.. సుహాస్ మరో హిట్ కొట్టినట్టేనా..
ప్రసన్న వదనం మూవీ రివ్యూ.. సుహాస్ మరో హిట్ కొట్టినట్టేనా..
CBSC 10, 12 తరగతుల ఫలితాలపై కీలక అప్‌డేట్.. రిజల్ట్స్‌ తేదీ ఇదే!
CBSC 10, 12 తరగతుల ఫలితాలపై కీలక అప్‌డేట్.. రిజల్ట్స్‌ తేదీ ఇదే!
టీమిండియాకు మరోసారి భారీ షాక్ ఇచ్చిన ఆస్ట్రేలియా..
టీమిండియాకు మరోసారి భారీ షాక్ ఇచ్చిన ఆస్ట్రేలియా..
మ్యూచువల్ ఫండ్ ఖాతాదారులకు అలెర్ట్.. నామినేషన్ వల్ల లాభాలెన్నో.!
మ్యూచువల్ ఫండ్ ఖాతాదారులకు అలెర్ట్.. నామినేషన్ వల్ల లాభాలెన్నో.!
ఇదేం స్పీడ్ అన్నా.. నరాలు కట్.. గిన్నిస్ బుక్‌ ఎక్కేశాడు
ఇదేం స్పీడ్ అన్నా.. నరాలు కట్.. గిన్నిస్ బుక్‌ ఎక్కేశాడు
మీ ఇంట్లో ఉండే వాటితోటే పాదాలపై నలుపును ఇలా పోగొట్టండి..
మీ ఇంట్లో ఉండే వాటితోటే పాదాలపై నలుపును ఇలా పోగొట్టండి..
చిన్న వ్యాయామాలతో పెద్ద సమస్యకు చెక్‌.. అధ్యయనంలో తేలిన విషయాలు
చిన్న వ్యాయామాలతో పెద్ద సమస్యకు చెక్‌.. అధ్యయనంలో తేలిన విషయాలు
ఈ పాపం కొవి షీల్డ్‌దేనా ..
ఈ పాపం కొవి షీల్డ్‌దేనా ..
రిజర్వేషన్ల అంశం కాంగ్రెస్‎కు కలిసొచ్చేనా? సీఎం రేవంత్ వ్యూహం ఇదే
రిజర్వేషన్ల అంశం కాంగ్రెస్‎కు కలిసొచ్చేనా? సీఎం రేవంత్ వ్యూహం ఇదే
బంగారం కొనుగోలు చేస్తున్నారా..?కొనుగోలు సమయంలో ఈ జాగ్రత్తలు మస్ట్
బంగారం కొనుగోలు చేస్తున్నారా..?కొనుగోలు సమయంలో ఈ జాగ్రత్తలు మస్ట్