డెడ్‌లైన్ ఫిక్స్..బీజేపీ ప్రచారాస్త్రంగా ఎన్‌ఆర్‌సీ..?

| Edited By: Anil kumar poka

Oct 18, 2019 | 6:58 AM

జాతీయ పౌర రిజిస్టర్‌ (ఎన్‌ఆర్‌సీ)ను హైదరాబాద్‌ సహా దేశమంతటా అమలు చేస్తామని కేంద్ర హోంమంత్రి, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా ప్రకటించారు. దేశంలో తిష్ఠవేసిన అక్రమ వలసదారులందరినీ 2024 లోగా తరిమికొడతామని తేల్చిచెప్పారు.  చొరబాటుదారులను పంపేందుకు చట్టబద్ధమైన ప్రక్రియ ఉంటుందని.. ఐక్యరాజ్యసమితి ఒప్పందం ప్రకారం దాన్ని అమలు చేస్తామన్నారు. ఎన్‌ఆర్‌సీ విషయంలో ఇప్పుడున్న ప్రక్రియలో ఏమైనా పొరపాట్లు ఉంటే పరిశీలించి వాటిని సరిచేసి కొత్త ప్రక్రియను అమల్లోకి తీసుకొస్తామని చెప్పారు. గురువారం హరియాణలోని గుర్గావ్‌ సభలో, […]

డెడ్‌లైన్ ఫిక్స్..బీజేపీ ప్రచారాస్త్రంగా ఎన్‌ఆర్‌సీ..?
Follow us on

జాతీయ పౌర రిజిస్టర్‌ (ఎన్‌ఆర్‌సీ)ను హైదరాబాద్‌ సహా దేశమంతటా అమలు చేస్తామని కేంద్ర హోంమంత్రి, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా ప్రకటించారు. దేశంలో తిష్ఠవేసిన అక్రమ వలసదారులందరినీ 2024 లోగా తరిమికొడతామని తేల్చిచెప్పారు.  చొరబాటుదారులను పంపేందుకు చట్టబద్ధమైన ప్రక్రియ ఉంటుందని.. ఐక్యరాజ్యసమితి ఒప్పందం ప్రకారం దాన్ని అమలు చేస్తామన్నారు. ఎన్‌ఆర్‌సీ విషయంలో ఇప్పుడున్న ప్రక్రియలో ఏమైనా పొరపాట్లు ఉంటే పరిశీలించి వాటిని సరిచేసి కొత్త ప్రక్రియను అమల్లోకి తీసుకొస్తామని చెప్పారు. గురువారం హరియాణలోని గుర్గావ్‌ సభలో, యూపీలోని వారణాసిలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు.  ట్రైబ్యునళ్ల ద్వారా దేశవ్యాప్తంగా ఎన్‌ఆర్‌సీ ప్రక్రియ చేపడతామని స్పష్టం చేశారు. అసలు ఎన్‌ఆర్‌సీని కాంగ్రెస్‌ నేత రాహుల్‌గాంధీ ఎందుకు వ్యతిరేకిస్తున్నారని ప్రశ్నించారు.

బెంగాల్ ఎన్నికలపై:

పశ్చిమబెంగాల్‌ శాసనసభ ఎన్నికల్లో విజయ దుందుభి మోగిస్తామని.. మహారాష్ట్రలో మరోసారి బీజేపీ-శివసేన కూటమి అధికారంలోకి వస్తుందని అమిత్‌షా ధీమా వ్యక్తం చేశారు. అక్కడ ఎన్‌సీ ప్రధాన ప్రచారాస్త్రంగా మారనుందన్న సంకేతాలు ఇచ్చారు. సీబీఐ, ఈడీలను తమ ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందన్న ఆరోపణలను అమిత్‌షా తోసిపుచ్చారు. యూపీఏ హయాంలో నమోదైన ఎఫ్‌ఐఆర్‌ల ఆధారంగానే తమ ప్రభుత్వం విచారణ చేస్తోందని వివరించారు.

బిహార్‌పై క్లారిటీ :

బిహార్‌లో భీజేపీ-జేడీయూ పొత్తు కొనసాగుతుందని అమిత్‌షా స్పష్టం చేశారు. రెండు పార్టీలు కలిసే ఎన్నికల్లో పోటీ చేస్తాయన్నారు. సీఎం నితీశ్‌ కుమార్‌ నేతృత్వంలోనే ఎన్నికల బరిలో దిగుతామని చెప్పారు. పొత్తు ఉన్నప్పుడు రెండు పార్టీల మధ్య కిందిస్థాయిలో కొంతమేర విభేదాలు ఉండటం సర్వసాధారణమన్నారు. బిహార్‌ ఎన్నికల్లో తమ పార్టీకి మూడింట రెండొంతుల మెజార్టీ వస్తుందని షా ఆశాభావం వ్యక్తం చేశారు.

గంగూలీతో చర్చలపై:

బీసీసీఐకి కాబోయే అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీతో ఎలాంటి రాజకీయ చర్చలు జరపలేదని.. మున్ముందు ఏమైనా జరగొచ్చని  అమిత్ షా అన్నారు. అక్కడ తృణమూల్‌ ప్రభుత్వాన్ని గద్దె దించాలని ప్రజలు నిర్ణయించుకున్నారని జోస్యం చెప్పారు.