ఐఆర్‌సీటీసీలో మరికొంత వాటా విక్రయానికి సన్నాహాలు

| Edited By:

Aug 21, 2020 | 8:52 AM

ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్‌(ఐఆర్‌సీటీసీ)లో మరికొంత వాటాను విక్రయించేందుకు కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది

ఐఆర్‌సీటీసీలో మరికొంత వాటా విక్రయానికి సన్నాహాలు
Follow us on

IRCTC share sale: ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్‌(ఐఆర్‌సీటీసీ)లో మరికొంత వాటాను విక్రయించేందుకు కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఐఆర్‌సీటీసీలో కొంత వాటాను ఆఫర్ ఫర్ సేల్‌(ఓఎఫ్‌ఎస్‌) విధానంలో విక్రయించనున్నారు. దీనికి సంబంధించి విక్రయ ప్రక్రియను నిర్వహించడానికి మర్చంట్ బ్యాంకర్ల నుంచి దరఖాస్తులు ఆహ్వానించింది. వచ్చే నెల 10 లోగా మర్చంట్ బ్యాంకర్లు బిడ్‌లను దాఖలు చేయాల్సి ఉంటుంది. కాగా ఐఆర్‌సీటీసీలో ప్రస్తుతం ప్రభుత్వానికి 87.40శాతం వాటా ఉండగా.. సెబీ పబ్లిక్ హోల్డింగ్ నిబంధనల ప్రకారం 75 శాతానికి తగ్గించుకోవాల్సి ఉంటుంది.

Read More:

కరోనా వ్యాక్సిన్‌ మొదట ఎవరికి..!

సహాయక చర్యలు కొనసాగుతున్నాయి: మంత్రి జగదీష్ రెడ్డి