Pralhad Joshi: ప్రధాని మోదీ తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయాలతోనే ఇదంతా సాధ్యమైంది: రాజ్యసభలో ప్రహ్లాద్ జోషి

|

Aug 06, 2024 | 7:15 PM

భారతదేశంలో పునరుత్పాదక ఇంధన సామర్థ్యం గత పదేళ్లలో 165 శాతం వృద్ధిని నమోదు చేసిందని.. ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి పేర్కొన్నారు. రాజ్యసభలో కొత్త, పునరుత్పాదక ఇంధన శాఖ పని తీరుపై చర్చ జరిగింది.. ఈ సందర్భంగా విపక్ష ఎంపీలు అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ.. ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి మాట్లాడారు.

Pralhad Joshi: ప్రధాని మోదీ తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయాలతోనే ఇదంతా సాధ్యమైంది: రాజ్యసభలో ప్రహ్లాద్ జోషి
Pralhad Joshi
Follow us on

భారతదేశంలో పునరుత్పాదక ఇంధన సామర్థ్యం గత పదేళ్లలో 165 శాతం వృద్ధిని నమోదు చేసిందని.. ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి పేర్కొన్నారు. రాజ్యసభలో కొత్త, పునరుత్పాదక ఇంధన శాఖ పని తీరుపై చర్చ జరిగింది.. ఈ సందర్భంగా విపక్ష ఎంపీలు అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ.. ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి మాట్లాడారు. పునరుత్పాదక ఇంధన సామర్థ్యం 2014లో 76.38 గిగావాట్‌లు ఉండగా.. 2024 నాటికి 203 గిగావాట్‌లకు పెరిగిందని తెలిపారు. మొత్తంగా 165 శాతం వృద్ధిని నమోదు చేసిందని తెలిపారు. రెన్యూవబుల్ ఎనర్జీ స్థాపిత సామర్థ్యంలో భారత్ ప్రపంచవ్యాప్తంగా నాలుగో స్థానంలో ఉందన్నారు. గత పదేళ్లలో పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టుల్లో సుమారు ఏడు లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయని జోషి తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ నాయకత్వంలో భారతదేశం వ్యవస్థాపించిన పునరుత్పాదక ఇంధన ఉత్పత్తి సామర్థ్యం గత 10 సంవత్సరాలలో భారీగా పెరిగిందన్నారు. ప్రహ్లాద్ జోషి ఇంకా మాట్లాడుతూ.. నరేంద్రమోదీ నాయకత్వంలో కేంద్రం తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయాల కారణంగా, భారతదేశం ఆర్థిక వ్యవస్థలో 5వ స్థానంలో.. పునరుత్పాదక ఇంధన వ్యవస్థాపక సామర్థ్యంలో 4వ స్థానంలో ఉందని తెలిపారు. పవన విద్యుత్ సామర్థ్యంలో 4వ స్థానంలో, సోలార్ పీవీ సామర్థ్యంలో 5వ స్థానంలో ఉన్నామని తెలిపారు. 2030 నాటికి భారతదేశం 500 GW నాన్-ఫాసిల్ సోర్సెస్‌ని ఇన్‌స్టాల్ చేయబోతున్నదని ప్రహ్లాద్ జోషి చెప్పారు

2024-25 కేంద్ర బడ్జెట్‌లో న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ రంగానికి 21 వేల కోట్ల రూపాయలకు పైగా కేటాయించామని, ఇది గతేడాది పది వేల కోట్ల రూపాయలుగా ఉందని మంత్రి ప్రహ్లాద్ జోషి చెప్పారు. బడ్జెట్‌లో ఇంత భారీ కేటాయింపులు చేయడం వల్ల స్థానిక స్థాయిలో పునరుత్పాదక రంగంలో ఉపాధి అవకాశాలు ఏర్పడతాయని, శిలాజ ఇంధనాలపై ఆధారపడటం తగ్గుతుందని జోషి అన్నారు. పిఎం సూర్య ఘర్, పిఎం కుసుమ్, నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ వంటి పునరుత్పాదక ఇంధన సంబంధిత పథకాలకు లక్షా 60 వేల కోట్ల రూపాయలను కేటాయించినట్లు ఆయన తెలిపారు. యూపీఏ హయాంలో యూనిట్‌కు సౌర విద్యుత్‌ టారిఫ్‌ దాదాపు 11 రూపాయలు ఉండగా, 2024 నాటికి యూనిట్‌కు రెండు రూపాయల 60 పైసలకు తగ్గిందని మంత్రి చెప్పారు.

ప్రధాన మంత్రి సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజనకు ప్రజల నుండి విశేష స్పందన లభించిందని.. జూలై 2024 వరకు 1.30 కోట్ల మందికి పైగా ప్రజలు ఇప్పటికే ఈ పథకం కింద నమోదు చేసుకున్నారని కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. 15 లక్షలకు పైగా వినియోగదారుల దరఖాస్తులు స్వీకరించామని తెలిపారు. ఇప్పటికే దాదాపు 2.3 లక్షల సోలార్ రూఫ్‌టాప్ సిస్టమ్‌లను ఏర్పాటు చేశారన్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..