Pralhad Joshi: మద్దతు ధరకే పంటల కొనుగోలు.. కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి కీలక ప్రకటన..

|

Aug 25, 2024 | 4:59 PM

రాష్ట్ర మార్కెట్‌లలో రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర రావడంలేదని.. పంటకు సరైన ధర లభించకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి ఆవేదన వ్యక్తంచేశారు. అలాంటి రైతులందరికీ కేంద్ర ప్రభుత్వం అండగా నిలుస్తోందని వివరించారు.

Pralhad Joshi: మద్దతు ధరకే పంటల కొనుగోలు.. కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి కీలక ప్రకటన..
Pralhad Joshi - Shivraj Singh Chouhan
Follow us on

రాష్ట్ర మార్కెట్‌లలో రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర రావడంలేదని.. పంటకు సరైన ధర లభించకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి ఆవేదన వ్యక్తంచేశారు. అలాంటి రైతులందరికీ కేంద్ర ప్రభుత్వం అండగా నిలుస్తోందని వివరించారు. కేంద్రం పప్పుధాన్యాలు, పొద్దుతిరుగుడు పంటలను మద్దతు ధర పథకం కింద కొనుగోలు చేసేందుకు అనుమతి ఇచ్చిందని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. మద్దతు ధర పథకం (MSP) కింద పెసలు క్వింటాల్‌కు రూ. 8682 (ఎంఎస్‌పి) చొప్పున కొనుగోలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతినిచ్చిందన్నారు. కర్ణాటక రాష్ట్ర మార్కెట్‌లో పెసలు, పొద్దుతిరుగుడు ధర పడిపోయిందని.. పండించిన పంటలకు సరైన ధర లభించక రైతులు ఇబ్బంది పడుతున్నారని, అలాంటి వారిని ఆదుకునేందుకు కేంద్రం సాయం అందిస్తుందని సోషల్ మీడియా ప్లాట్ ఫాం ఎక్స్‌ వేదికగా షేర్ చేశారు.

ఎమ్‌ఎస్‌పి (MSP) కింద పంటను కొనుగోలు చేయనున్నట్లు వివరించారు. క్వింటాల్‌కు రూ.8682 చొప్పున 2215 మెట్రిక్‌టన్నుల పెసలును కొనుగోలు చేసేందుకు కేంద్రం అనుమతిచ్చిందని ప్రహ్లాద్ జోషి తెలిపారు. అదేవిధంగా 13,210 మెట్రిక్ టన్నుల పొద్దుతిరుగుడు పంటను మద్దతు ధర పథకం కింద కొనుగోలు చేసేందుకు ఆమోదం తెలిపిందన్నారు.

కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వానికి లేఖ అందిన వెంటనే.. తాను కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్‌సింగ్ చవాన్‌ను కలుసుకుని రాష్ట్రంలో పెసలు, పొద్దుతిరుగుడు పంటలను కొనుగోలు చేయాలని అభ్యర్థించినట్లు వెల్లడించారు. వెంటనే కేంద్రమంత్రి అధికారులతో చర్చించి వెంటనే అనుమతి ఇవ్వాలని సూచించారన్నారు. దీని ప్రకారం, కేంద్ర ప్రభుత్వం లేఖ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి అనుమతి ఇచ్చిందని తెలిపారు.

ప్రహ్లాద్ జోషి ట్వీట్..

తన అభ్యర్థనకు తక్షణమే స్పందించి, కొనుగోలుకు ఆమోదం తెలిపినందుకు ప్రధాని నరేంద్ర మోదీ, వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చవాన్‌లకు ప్రహ్లాద్ జోషి ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించి, కొనుగోలు ప్రక్రియను ప్రారంభించాలని కర్ణాటక ప్రభుత్వాన్ని కోరారు. దేశంలోని ప్రతి రైతు పక్షాన పనిచేస్తున్న ప్రధాని మోదీ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. రైతుల ప్రతి సమస్యకు తగిన, ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటూ వారికి వెన్నుదన్నుగా పనిచేస్తుందని వివరించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..