Jan Dhan Account: 41 కోట్లు దాటిన జన్‌ధన్‌ ఖాతాల లబ్దిదారుల సంఖ్య.. ప్రకటించిన కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ

|

Jan 20, 2021 | 2:27 PM

Jan Dhan Account: కేంద్ర సర్కార్‌ ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన ప్రధాన మంత్రి జన్‌ధన్‌ యోజన (పీఎంజేడీవై) లబ్దిదారుల సంఖ్య 41 కోట్లు దాటినట్లు కేంద్ర ఆర్థిక..

Jan Dhan Account: 41 కోట్లు దాటిన జన్‌ధన్‌ ఖాతాల లబ్దిదారుల సంఖ్య.. ప్రకటించిన కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ
Follow us on

Jan Dhan Account: కేంద్ర సర్కార్‌ ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన ప్రధాన మంత్రి జన్‌ధన్‌ యోజన (పీఎంజేడీవై) లబ్దిదారుల సంఖ్య 41 కోట్లు దాటినట్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ వెల్లడించింది. ఈనెల 6నాటికి దేశంలో జన్‌ధన్‌ ఖాతాల సంఖ్య 41.6 కోట్లుగా ఉన్నట్లు తెలిపింది. అలాగే మార్చి 2015లో 58 శాతం ఉన్న జీరో అకౌంట్ల సంఖ్య ఇప్పుడు 7.5 శాతానికి తగ్గినట్లుగా తెలియజేస్తూ ట్వీట్‌ చేసింది. ప్రధాన మంత్రి నరేంద్రమోదీ 2014 స్వాతంత్ర్య దినోత్సవ రోజున జన్‌ధన్‌ యోజన పథకాన్ని ప్రకటించారు. అయితే ఆగస్టు 28న ఈ పథకం ప్రారంభమైంది.

ఈ పథకానికి మరింత మెరుగుపరుస్తూ మరిన్ని సదుపాయాలు, ప్రయోజనాలతో 2018లో ప్రభుత్వం పీఎంజేడీవై 2.0ను ప్రారంభించింది. ఇందులో భాగంగా ప్రభుత్వం ప్రతి ఇంటిపైన, బ్యాంకు ఖాతాలకు రూపే పైనా ప్రత్యేక దృష్టి సారించింది. 2018 ఆగస్టు 28 తర్వాత తెరిచిన జన్‌ధన్‌ ఖాతాదారులకు రూపే కార్డుపై ఉచితంగా అందిస్తున్న ప్రమాద బీమాను రూ. 2 లక్షలకు పెంచింది. అలాగే ఓవర్‌ డ్రాఫ్ట్‌ పరిమితిని రెండింతలు చేసి రూ.10వేలకు పెంచింది.

 

Also Read: Budget Session జ‌న‌వ‌రి 30న అఖిలపక్ష సమావేశం… రెండు విడుత‌లుగా బ‌డ్జెట్ స‌మావేశాలు…